చనిపోయాడనుకున్నారు.. 24 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమయ్యాడు!

Jul 21 2021 @ 14:23PM

ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన మధో సింగ్ 24 సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యాడు. చాలా కాలం పాటు వేచి చూసిన కుటుంబం అతడు తిరిగి రాకపోయేసరికి చనిపోయి ఉంటాడని నిర్ధారణకు వచ్చేసింది. కర్మకాండ జరిపించి ఏటా పిండ ప్రదానం కూడా చేస్తోంది. అయితే 24 ఏళ్ల తర్వాత గత వారం అనూహ్యంగా మధోసింగ్ తిరిగి వచ్చాడు. దీంతో కుటుంబంతోపాటు గ్రామస్తులు కూడా షాకయ్యారు. 


అల్మోరా జిల్లా రాణీఖేత్ గ్రామ శివారు ప్రాంతంలో గత ఆదివారం ఓ వ్యక్తి అత్యంత బలహీన స్థితిలో కనిపించాడు. అతడిని మధోసింగ్‌గా గ్రామస్తులు గుర్తించారు. అతడిని మోసుకుంటూ ఇంటి వద్దకు చేర్చారు. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇన్నేళ్లుగా పిండ ప్రదానం చేస్తున్నందున తిరిగి నామకరణం చేసిన తర్వాతే అతడిని ఇంట్లోకి రానివ్వాలని పూజరి చెప్పడంతో కుటుంబ సభ్యులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మధో ఇంటి నుంచి వెళ్లిన నాటి నుంచి అతని భార్య వితంతువుగానే జీవితాన్ని కొనసాగించింది. కొడుకు, కూతురు వివాహాలను చేసింది. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...