Uttarakhand Rainfall : బదరీనాథ్-కేదార్‌నాథ్ హైవేపై ప్రయాణాలకు ఆటంకం

ABN , First Publish Date - 2022-06-30T18:06:49+05:30 IST

రుతుపవనాల రాకతో ఉత్తరాఖండ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో

Uttarakhand Rainfall : బదరీనాథ్-కేదార్‌నాథ్ హైవేపై ప్రయాణాలకు ఆటంకం

న్యూఢిల్లీ : రుతుపవనాల రాకతో ఉత్తరాఖండ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బదరీనాథ్-కేదార్‌నాథ్ హైవేపై రాళ్ళు, మట్టి పడటం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైవేపై కార్లు, లారీలు భారీగా నిలిచిపోయాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో ఇబ్బందిపడినవారికి ఈ వాతావరణం ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. 


న్యూఢిల్లీలోని తూర్పు కైలాష్, బురారి, షహ్‌దరా, పట్పర్‌గంజ్, ఐటీఓ క్రాసింగ్, ఇండియా గేట్, బారాపుల్లా, రింగ్ రోడ్డు, ఢిల్లీ-నోయిడా బోర్డర్, ఢిల్లీ-గురుగ్రామ్ రోడ్లు ప్రాంతాల్లో గురువారం ఉదయం వర్షం కురిసింది. ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్‌లు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. 


ఇక చలి కాలం, వర్షాకాలం పరిస్థితులను పరిశీలించినపుడు, జమ్మూ-కశ్మీరులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాతి స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ నిలుస్తాయి. కానీ వర్షాలు పడటాన్ని పరిశీలించినపుడు వర్షాకాలంలో ఉత్తరాఖండ్‌లో ఎక్కువ వర్షాలు పడతాయి. జమ్మూ-కశ్మీరులో తక్కువ వర్షాలు కురుస్తాయి. 


ఉత్తరాఖండ్‌లో నైరుతి రుతు పవనాల వల్ల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రాష్ట్రంలో బాస్మతి బియ్యం బాగా పండుతాయి. రైతులు బాస్మతి పంట నాట్లు వేశారు. వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత వర్షాలు వారికి ఉపయోగకరంగా ఉంటాయి. 


Updated Date - 2022-06-30T18:06:49+05:30 IST