అభివృద్ధి సాధనకు ‘ఉత్తరాంధ్ర మేలుకొలుపు’

ABN , First Publish Date - 2021-01-24T05:29:44+05:30 IST

శ్రీకాకుళం, విజయనగ రం, విశాఖపట్నం జి ల్లాల అభివృద్ధిని ఆ కాంక్షిస్తూ ఉత్తరాంధ్ర మేలుకొలుపు సంస్థను స్థాపించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పాకలపాటి సన్యాసిరాజు తెలిపారు.

అభివృద్ధి సాధనకు ‘ఉత్తరాంధ్ర మేలుకొలుపు’
మాట్లాడుతున్న సన్యాసిరాజు


గుజరాతీపేట: శ్రీకాకుళం, విజయనగ రం, విశాఖపట్నం జి ల్లాల అభివృద్ధిని ఆ కాంక్షిస్తూ ఉత్తరాంధ్ర మేలుకొలుపు సంస్థను స్థాపించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పాకలపాటి సన్యాసిరాజు తెలిపారు. నగరంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఉత్తరాంధ్ర జిల్లాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనునబడ్డాయని విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఉత్తరాంధ్రకు చెందిన అనేక సమస్యలను తీసుకొచ్చారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, యువతకు ఉపాధి అవ కాశాలు కల్పించాలని, మూడు జిల్లాలోని సముద్రతీర ప్రాంతాలను కలుపుతూ నాలుగులైన్ల రోడ్డును వేయాలని డిమాండ్‌ చేశారు. మత్స్యకారుల కోసం జట్టీలు నిర్మించాలని కోరారు.  సమావేశంలో మాజీ  ఎంపీ కణితి విశ్వ నాథం, బీజేపీ  జిల్లా అధ్యక్షుడు అట్టాడ రవిబాబ్జీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్ల  కన్నారావు, పార్వతీపురం బీజేపీ అధ్యక్షుడు తిరుపతిరావు, జనసేన రాష్ట్ర నాయకుడు ఆదాడ మోహన్‌, కాపునాడు రాష్ట్ర నాయకుడు కరణం మురళి పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-24T05:29:44+05:30 IST