ఉత్సాహంగా ఉట్టి మహోత్సవం

ABN , First Publish Date - 2022-08-20T05:23:18+05:30 IST

శ్రీకృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం జిల్లావాసులు ఘనంగా నిర్వహించారు. పలు దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు చేశారు.

ఉత్సాహంగా ఉట్టి మహోత్సవం
ఒంగోలులో ఉత్సాహంగా ఉట్టి కొడుతున్న మహిళలు

 ఒంగోలు (కల్చరల్‌) : శ్రీకృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం జిల్లావాసులు ఘనంగా నిర్వహించారు. పలు దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు చేశారు. అనేకమంది తమ ఇళ్లలో సైతం కృష్ణుని ప్రతిమలను తులసికోట వద్ద, పూజామందిరంలో ఉంచి పూజలు నిర్వహించారు. పలుచోట్ల ఉట్టి మహోత్సవం ఉత్సాహంగా సాగింది. చిన్నారులు, యువకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సాహంగా ఉట్టి కొట్టారు. పలు విద్యాసంస్థల్లో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-20T05:23:18+05:30 IST