ఊరూరా స్వాతంత్య్ర వేడుకలు

ABN , First Publish Date - 2022-08-16T03:45:57+05:30 IST

పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యాల

ఊరూరా స్వాతంత్య్ర వేడుకలు
ఆత్మకూరు : మున్సిపల్‌ కార్యాలయంలో జెండా వందనం చేస్తున్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి

 రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు

 సాంస్కృతిక  కార్యక్రమాల నిర్వహణ

ఆత్మకూరు, ఆగస్టు 15 : పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యాలయ ప్రాంగణంలో మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర వేడుకలను పురష్కరించుకుని నియోజకవర్గ పరిధిలో  75 వేల మొక్కలను నాటేందుకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా  ప్రతిభ కనపరిచిన ఉద్యోగులలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం 500 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎం రమేష్‌బాబు, చైర్‌పర్సన్‌ జి వెంకటరమణమ్మ, వైస్‌చైర్మన్లు డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌, షేక్‌ సర్ధార్‌ తదితరులు పాల్గొన్నారు. జలవనరుల శాఖ కార్యాలయంలో ఈఈ ఆర్‌ వెంకటేశ్వరరావు,  ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో కరుణకుమారి, ఎంపీడీవో, వెలుగు కార్యాలయాల్లో ఎంపీపీ కేతా వేణుగోపాల్‌రెడ్డి, సోమశిల ప్రాజెక్టు డివిజన్‌ - 4 కార్యాలయంలో ఈఈ వెంకటరమణారెడ్డి,  ఏఎంసీ కార్యాలయంలో చైర్మన్‌ అల్లారెడ్డి అనసూయమ్మ  జాతీయ జెండాను ఆవిష్కరించారు. జనసేన కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇన్‌చార్జి నలిశెట్టి శ్రీధర్‌, సొసైటీలో చైర్మన్‌ ఎన్‌. ప్రతాప్‌రెడ్డి , డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలీసుస్టేషన్‌లో సీఐ వేణుగోపాల్‌రెడ్డి  జెండా ఎగురవేశారు. తహసీల్దారు కార్యాలయం ఎదుట ఉన్న గాంధీజీ విగ్రహానికి తహసీల్దారు పిఎల్‌ నరసింహం పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యవసాయ ఉపంచాలకులు కార్యాలయం వద్ద ఏడీఏ దేవసేన జెండాను ఎగురవేశారు. అలాగే అన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జెండాను ఎగురవేశారు.

సంగం : తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు జయవర్థన్‌, ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీటీసీ, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ నాగార్జున్‌రెడ్డి, ప్రభుత్వ వైద్యశాల్లో వైద్యాధికారి ప్రతిమ జాతీయ జెండాను ఎగురవేశారు. మిఠాయిలు పంచిపెట్టారు.  మండలంలోని వెంగారెడ్డిపాళెంలో సర్పంచు ఆనం ప్రసాద్‌రెడ్డి, సంగంలో రమణమ్మ, పడమటిపాళెంలో బాలకృష్ణారెడ్డి జాతీయ జెండాలు ఎగురవేసి మిఠాయిలు పంచిపెట్టారు. అదేవిధంగా పాఠశాలల్లో ఆయా ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నారు.

కలువాయి :  తహసీల్దారు కార్యాలయంలో జడ్పీటీసీ బీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఆర్‌.లక్ష్మీదేవి, కుల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, పోలీస్టేషన్‌లో ఎస్‌ఐ ప్రభాకర్‌, జడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం ఎస్‌.జనార్దన్‌రెడ్డి జాతీయ జెండా ఏగుర వేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు శ్యామ్‌సుందర రాజు పాల్గొన్నారు.

అనంతసాగరం : స్థానిక శాంతినికేతన్‌ విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్ధుల  చేపట్టిన ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత ఎంపీడీవో కార్యాలయం, ఉన్నత పాఠశాల, గ్రంథాలయంలో జడ్పీటీసీ వెంకటసుబ్బారెడ్డి జాతీయ పతాకం ఎగుర వేసి విద్యార్థులకు బహుమతులు అందించారు.

వలేటివారిపాలెం :   ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీటీసీ ఇంటూరి భారతి, తహసీల్దార్‌ కార్యాలయంలో ఎంపీపీ పొనుగోటి మౌనిక, విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో సబ్‌ ఇంజనీర్‌ జ్యోత్స్న, పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌ ఏడుకొండలు, జాతీయ జెండా ఎగురవేశారు. అన్నీ ప్రభుత్వ కార్యాలయలు, పాఠశాలలు,  మండలంలోని గ్రామాల్లో  త్రివర్ణ పతాకాన్ని  ఎగురవేశారు. పోకూరు ముసలన్నకుంట, చుండిదాదినీడి చెరువులో సోమవారం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా వేడుకలు నిర్వహించారు. కాగా ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా షేక్‌ అబ్దుల్‌బారిని ఎంపిక చేశారు ఆయనకు ఎంపీపీ పొనుగోటి మౌనిక, జడ్పీటీసీ సభ్యురాలు ఇంటూరి భారతి చేతుల మీదుగా బహుమతి, ప్రశంసాపత్రం అందజేశారు. అలాగే వలేటివారిపాలెం, అంకభూపాలపురం టీడీపీ కార్యాలయాలలో సోమవారం స్వాతంత్య్ర  వేడుకలు  జరిగాయి. నాయకులు మాదాల లక్ష్మీనరసింహం, కాకుమాను ఆంజనేయులు, కామినేని అశోక్‌, వలేటి నరసింహం, చెన్నకేశవులు, గుత్తా కొండయ్య, కాకుమాని హర్ష,  న్యాయవాదులు ప్రెగడ శ్రీనివాస్‌,  వలేటి శ్రీధర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఎగరని జెండా

వలేటివారిపాలెంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో  అధికారులు సోమవారం జాతీయ జెండాను ఎగురవేయలేదు.  దీంతో పలువురు విస్మయం వ్యక్తం చేశారు. 

ఉలవపాడు  : మండలంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్ధార్‌ మహ్మద్‌ హుస్సేన్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో చెంచమ్మ, మండలంలోని 16 సచివాలయాలలో సిబ్బంది త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

లింగసముద్రం :  స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద మండల టీడీపీ అధ్యక్షుడు వేముల గోపాలరావు జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు స్వీట్లు పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్‌ నారాయణ, ఎన్‌ బ్రహ్మారెడ్డి, గాలంకి ప్రసాద్‌, యు పెద్ద మాధవరావు, కె మధు, స్వర్ణ చిన్న,  వెంగళరావు, అడపా నరసయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ఆర్‌ బ్రహ్మయ్య, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పెన్నా శివరామకృష్ణ, ఎంఆర్‌సీలో స్థానిక హైస్కూల్‌ హెచ్‌ఎం కె సూర్య ప్రకాశరావు, పీహెచ్‌సీలో సీహెచ్‌వో జి శ్రీనివాసులు, పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌ పి మల్లికార్జునరావు జాతీయ జెండాలను ఎగుర వేశారు.

 గుడ్లూరు :  స్ధానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పులి రమేష్‌, ఎంపీడీవో శ్రీనివాసులరెడ్డిలు, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్ధార్‌ లావణ్య, వైద్యఆరోగ్య కేంద్రంలో డాక్డర్‌ మారుతీరావు, వెలుగు కార్యాలయంలో ఏపీఎం అశోక్‌, సచివాలయ కేంద్రాల్లో కార్యదర్సులు జాతీయ జెండాలను ఎగురవేసి నినాదాలు చేశారు.  బస్డాండ్‌ సెంటర్‌లో వ్యవసాయ కార్మిక సంఘం, రైతుసంఘం,  ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జాతీయజెండాను  నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ కే బాపిరెడ్డి, సర్పంచిలు పాలకీర్తి శంకర్‌, కొనికి గంగయ్య, ఎండ్లూరి డేవిడ్‌రాజ్‌ల తదితరులు పాల్గొన్నారు. 

ఏఎస్‌ పేట :  స్థానిక తహసీల్ధారు కార్యాలయంలో తహసీల్ధారు సుభద్ర, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పద్మజారెడ్డి, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ సుబహని, పంచాయతీ కార్యాలయంలో జడ్పీటీసీ రాజేశ్వరమ్మ, సర్పంచ్‌ తాజున్సీబేగం జెండాను ఎగరవేశారు. మిఠాయిలు పంచిపెట్టారు. అలాగే ఏఎస్‌పేటలోని కేకే రెసిడెన్సీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు జరిపారు.  కార్యక్రమంలో ఎస్‌ఐ సుబహని, వైసీపీ మండల కన్వీనర్‌ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, కేకే రెసిడెన్సీ ఓనర్‌ ఖాజా తదితరులు పాల్గొన్నారు.

------------











Updated Date - 2022-08-16T03:45:57+05:30 IST