టీకా వేయించుకోండి.. కరోనాను తరిమికొట్టండి

Jun 20 2021 @ 00:15AM
నరసన్నపేట : మాట్లాడుతున్న మండల ప్రత్యేకాధికారి రామన్‌:

 అధికారుల పిలుపు ఫనేడు సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ 

నరసన్నపేట, జూన్‌ 19: కరోనా టీకాను వేయించుకోండి.. మహమ్మారిని తరిమికొట్టండి అంటూ అధికారులు పిలుపునిచ్చారు. ఆదివారం నిర్వహించే వ్యాక్సినే షన్‌ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. నరసన్నపేట మండలంలోని 12 కేంద్రా ల్లో ఆదివారం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నట్టు ప్రత్యేకాధికారి ఆర్వీ రామన్‌ తెలి పారు. ఈ మేరకు శనివారం ఎంపీడీవో కార్యాలయంలో వైద్య, పంచాయతీ, రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం కూడా సంపూర్ణ లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్నారు. ఇదే క్రమంలో ఉదయం 8గంటల నుంచి జమ్ము, నరసన్నపేట 1, 2 సచివాలయాలు, దూకలపాడు, కోమర్తి, యారబా బు, లుకలాం, కామేశ్వరిపేట, నడగాం, ఉర్లాం లింగాలపాడు తదితర గ్రామాల్లో 1800 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.ప్రవల్లిక ప్రియ, ఎంపీడీవో రవికుమార్‌, వైద్యులు సుజాత తదితరులు పాల్గొన్నారు. ఫ  జలుమూరు : మండలంలోని మూడు పీహెచ్‌సీల పరిధిలోని 16 గ్రామ సచివాలయాల్లో ఆదివారం 2700 మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తహసీల్దార్‌ జె.ఈశ్వరమ్మ తెలిపారు. 45 ఏళ్లు దాటినవారితోపాటు బాలింతలు వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. సైరిగాం, గొటివాడ, పాగోడు, రాణ, టెక్కలిపాడు, చల్లవానిపేట, జోనంకి, టి.లింగాలపాడు, అక్కురాడ, మర్రివలస, నగిరికటకం, శ్రీముఖలింగం, కొమనాపల్లి, పర్లాం, అంధవరం, యలమంచిలి గ్రామ సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.ఫ  గార: కళింగపట్నం, గార, శ్రీకూర్మం పీహెచ్‌సీల పరిధిలోని 15 గ్రామ సచివాలయాల వద్ద ఆదివారం కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించను న్నట్లు తహశీల్దార్‌ జె.రామారావు తెలిపారు. శనివారం మండల పరిషత్‌ కా ర్యా టలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  వ్యాక్సి న్‌నేషన్‌ కోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్‌.రామ్మోహన్‌రావు, డీటీ ప్రసాదరావు, ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.  ఫ కవిటి: ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని మండల ప్రత్యేకాధికారి అప్పలస్వామి  సూచించారు.  శనివారం కవిటిలో పీహెచ్‌సీ వైద్యులు, పంచాయతీ కార్యద ర్శులు, మహిళా పోలీసు లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొరి వంక, బెలగాం, రాజపురం పీహెచ్‌సీల పరిధిలో కవిటి-3, కొజ్జిరియా, ఆర్‌.కరపాడు, బీజీపుట్టుగ, కుసుంపురం, వరక, డీజీపుట్టుగ, కపాసకుద్ది, కవిటి-2 సచివాలయాల పరిధి లో ఆదివారం వ్యాక్సినేషన్‌ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో సూర్యనారాయణ, వైద్యులు సురేష్‌కుమార్‌ జెన్నా, హరిత, ఆర్‌ఐ జీవన్‌ పాల్గొన్నారు. ఫ  సరుబుజ్జిలి: కరోనా వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యాధికారి సంతోష్‌కుమార్‌ కోరారు. సరుబుజ్జిలిలో ఆదివారం నిర్వహించే కరోనా  వ్యాక్సినేషన్‌పై అధికారులతో సమీక్షించారు.  కార్యక్రమంలో తహసీల్దార్‌ సనపల కిరణ్‌కుమార్‌, ఎంపీడీవో మురళీమోహన్‌కుమార్‌, సీహెచ్‌వో రాములు  పాల్గొన్నారు.


 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.