భారతీయుల ఎంట్రీపై కువైత్ కీలక ప్రకటన !

ABN , First Publish Date - 2021-07-30T14:34:16+05:30 IST

ఆగస్టు 1 నుంచి విదేశీయుల ఎంట్రీకి గల్ఫ్ దేశం కువైత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

భారతీయుల ఎంట్రీపై కువైత్ కీలక ప్రకటన !

కువైత్ సిటీ: ఆగస్టు 1 నుంచి విదేశీయుల ఎంట్రీకి గల్ఫ్ దేశం కువైత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయుల ఎంట్రీపై కువైత్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తాజాగా కీలక ప్రకటన చేసింది. కువైత్ ఆమోదించిన కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని, ఇమ్యూన్ యాప్‌లో గ్రీన్ కలర్ స్టేటస్ వచ్చిన భారతీయులు ట్రాన్సిట్ విమానాల ద్వారా తమ దేశానికి రావొచ్చని డీజీసీఏ ప్రకటించింది. ఇండియన్ ఎంబసీ వద్ద డీజీసీఏ ఎక్సలెన్సీ ఇంజనీర్ యూసఫ్ సులైమాన్ అల్ ఫౌజాన్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్, శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి కువైత్‌కు డైరెక్ట్ విమానాలకు అనుమతి లేదు. అయితే, భారతీయ ప్రవాసులు ఎవరైతే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని, ఇమ్యూన్ యాప్‌లో గ్రీన్ కలర్ స్టేటస్ ఉంటుందో వారు ట్రాన్సిట్ విమానాల ద్వారా కువైత్ రావొచ్చు. కానీ, ఇతర కరోనా నిబంధనలు ముఖ్యంగా జర్నీకి 72 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ రిపోర్టుతో పాటు కువైత్‌లో చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ పర్మిట్ కలిగి ఉండడం తప్పనిసరి అని యూసఫ్ సులైమాన్ అన్నారు. ఇక భారత్ నుంచి కువైత్‌కు డైరెక్ట్ విమాన సర్వీసులపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే దిశగా డీజీసీఏ మంతనాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.      

Updated Date - 2021-07-30T14:34:16+05:30 IST