వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తిచేయాలి : జేసీ

ABN , First Publish Date - 2021-10-27T06:09:26+05:30 IST

వార్డు సచివాలయం పరిదిలో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు 100 శాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ శ్రీధర్‌ సచివాలయ సిబ్బందికి సూచించారు.

వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తిచేయాలి : జేసీ
గంటాఊరు సచివాలయంలో రికార్డులు తనిఖీ చేస్తున్న జేసీ శ్రీధర్‌

పలమనేరు, అక్టోబరు26 : వార్డు సచివాలయం పరిదిలో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు 100 శాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ శ్రీధర్‌ సచివాలయ సిబ్బందికి సూచించారు. మంగళవారం జేసీ మున్సిపాలిటీ పరిధిలోని గంటాఊరు వార్డు సచివాలయాన్ని తనిఖీ చేశారు. అన్ని రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు.  కమిషనర్‌ కిరణ్‌కుమార్‌, డీఈ పుష్పగిరినాయక్‌ పాల్గొన్నారు.

బైరెడ్డిపల్లె: గ్రామాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందరూ వేసుకునేలా సచివాలయ ఉద్యోగులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ శ్రీధర్‌ సూచించారు. బైరెడ్డిపల్లె మండలం పాతూరునత్తం సచివాలయాన్ని ఆయన తనిఖీచేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఎలా జరుగుతోందనే విషయం గురించి  సిబ్బందితో మాట్లాడారు. తహసీల్దార్‌ సీతారామ్‌, ఎంపీడీవో రాజేంద్రబాలాజీ, గ్రామకార్యదర్శి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T06:09:26+05:30 IST