వారం ముందే 20 కోట్ల డోసులు!

ABN , First Publish Date - 2021-04-23T13:23:12+05:30 IST

అమెరికాలో నిర్దేశిత గడువు కంటే ముందుగానే 20 కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు ఇచ్చినట్లు అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన ఘన విజయమన్నారు. 100 రోజుల గడువు పెట్టుకోగా..

వారం ముందే 20 కోట్ల డోసులు!

  • వ్యాక్సినేషన్‌లో అద్భుత విజయం
  • అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వెల్లడి

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 22: అమెరికాలో నిర్దేశిత గడువు కంటే ముందుగానే 20 కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు ఇచ్చినట్లు అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన ఘన విజయమన్నారు. 100 రోజుల గడువు పెట్టుకోగా.. వారం రోజుల ముందే ఈ మైలురాయిని చేరుకున్నామని తెలిపారు. ‘‘ఈ రోజు మనం సాధించాం. 20 కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్నాం’’ అని బైడెన్‌ శ్వేతసౌధం నుంచి టీవీ ప్రసంగంలో చెప్పారు. ఇది అమెరికా సాధించిన అద్భుత విజయమన్నారు. కరోనాపై పోరు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో అప్రతిహతంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 


Updated Date - 2021-04-23T13:23:12+05:30 IST