కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో అందరికీ వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-01-17T05:19:12+05:30 IST

కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నట్లు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు.

కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో అందరికీ వ్యాక్సినేషన్‌
వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ

ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌
కామారెడ్డి టౌన్‌, జనవరి 16: కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నట్లు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. శనివారం కామారెడి ్డ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో విప్‌ గంప గోవర్ధన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌  శోభ, ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి కార్యక్రమాన్ని ప్రార ంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపా డడమే ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. వ్యాక్సిన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్తలంద రికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కరోనా కట్టడి కామారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలవడం అభినందనీయమని అందుకు కృషి చేసిన ప్రతీ ఒకరికి అభినందనలు తెలిపారు. మొదటి విడతలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసిన వైద్యసిబ్బంది, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలకు టీకాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌పై ఎలాంటి చెడు ప్రచారం చేసిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వ్యాక్సిన్‌ ను అన్ని రకాలుగా పరీక్షించిన తర్వాతే ప్రజలకు వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడ్డాయని తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ మాట్లాడుతూ కరోనా వ్యాధి కట్టడి చేసేందుకు వ్యాక్సిన్‌ రావడం సంతోషకరమని అన్నారు. కరోనా నిర్మూలనకు వైద్యసిబ్బంది, ఐసీడీఎస్‌, పోలీసు, రెవెన్యూ శాఖ, జిల్లా యంత్రాంగం చేసిన కృషిని కొనియాడారు. అనంతరం కలెక్టర్‌ శరత్‌ మాట్లాడుతూ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల, ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలో 22 శాతం ఉన్న పాజిటివ్‌ శాతాన్ని 0.32కు తగ్గించడం జరిగిందని, ముందు ముందు కరోనా నియంత్రణకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. అంతకు ముందు ప్రధానిమోదీ నిర్వహించిన వర్చువల్‌ స్పీచ్‌ను అందరూ వీక్షించారు. కాగా మొట్టమొదటి టీకాను ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌ తీసుకుని మిగిలిన సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆ తర్వాత వైద్యులు, సిబ్బంది మొత్తం 46మంది టీకా వేయించుకున్నారు. ఇక పట్టణంలోని రాజీవ్‌నగర్‌ పీహెచ్‌సీలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి వ్యాక్సి నేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ మొట్టమొదటి టీకాను సూపర్‌ వైజర్‌ రమణ వేసుకోగా ఆ తర్వాత వైద్యులు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది టీకాను వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్‌ యాదిరెడ్డి, ఆర్‌డీవో శ్రీను, ఆర్‌ఎంవో శ్రీనివాస్‌, డీఈవో రాజు, కౌన్సిలర్‌ గెరిగంటి స్వప్న, పట్టణ ఎస్‌హెచ్‌వో మధుసూదన్‌ రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్‌పై ప్రజలు అపోహలు వీడాలి
అజయ్‌కుమార్‌, డీసీహెచ్‌ఎస్‌, కామారెడ్డి.
కేంద, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో తీసుకు వచ్చిన వ్యాక్సినేషన్‌పై ప్రజలు అపోహలు వీడాలి. ఈ వ్యాక్సినేషన్‌ సురక్షితమైంది. శనివారం నిర్వహించిన టీకా కార్యక్రమంలో ముందస్తుగా టీకా తీసుకుని ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్‌లు లేవు. ప్రజలు వ్యాక్సినేషన్‌పై వచ్చే అసత్యప్రచారాలను నమ్మవద్దు.
వ్యాక్సినేషన్‌తో ఎలాంటి ఇబ్బంది లేదు
రమాదేవి, జనరల్‌ ఫిజీషియన్‌, ప్రభుత్వ వైద్యురాలు.
కొన్ని నెలల పాటు ఇబ్బందులకు గురి చేసిన కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషి వల్ల ప్రజలకు వ్యాక్సి నేషన్‌ అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంది. కరోనా సమయంలో తాము అందించిన చికిత్సలో భాగంగా కరోనా భారిన పడిన వారితో పాటు ఇతరులకు అపోహలు తొలగాలని తామే ముందు ఈ వ్యాక్సినేషన్‌ వేయించుకుని సురక్షితంగానే ఉండి ప్రజలకు భరోసా కల్పించాలని ఆలోచన చేశాం.
మొదటి విడత టీకా జాగ్రత్తగా నిర్వహించాలి
సదాశివనగర్‌, జనవరి 16: మొదటి విడతలో పంపిణీ చేసే టీకా కార్యక్రమం అతి జాగ్ర త్తగా నిర్వహించాలని ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ తెలిపారు. సదాశివనగర్‌ పీహెచ్‌సీలో శనివారం టీకా కార్యక్రమాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రేతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా ప్రకారం వైద్యఆరోగ్యశాఖ నిర్ధేశించిన అన్ని ప్రమాణాలను పాటించి ఎవరికి ఎటు వంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అనంతరం డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌, వైద్యాధికారి ఇద్రిస్‌ఘోరి పర్యవేక్షణలో మొట్టమొదటి టీకా క్లస్టర్‌ హెల్త్‌ ఆఫీసర్‌ నాగరాజుకు అందించారు. పీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ పంపిణీ చేపట్టగా మొదటి రోజు 59 మంది వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశ, అంగన్‌వాడీ సిబ్బందికి అందించామని వైద్యాధికారి తెలిపారు.
మొట్టమొదటి టీకా వేసుకున్నందుకు ఆనందంగా ఉంది
నాగరాజు, సీహెచ్‌వో.
జిల్లాలో పంపిణీ చేస్తున్న టీకా మొట్టమొదట తీసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. దీంతో మనోధైర్యం పెరిగింది. 28 రోజుల తర్వాత రెండో  డోసు వ్యాక్సిన్‌ తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా పెరిగి కొవిడ్‌ నుంచి భయమ నేది ఉండదు.
మామూలుగా ఇంజక్షన్‌ తీసుకున్నట్లే అనిపించింది
కొప్పుల సునంద, అంగన్‌వాడీ టీచర్‌.
వ్యాక్సిన్‌ టీకా తీసుకోవడం మాములు ఇంజక్షన్‌ తీసుకున్నట్లే అనిపించింది. భయంకరమైన కరోనాను టీకాతో దూరం చేసుకోవచ్చనే అభిప్రాయం కలిగింది. గత 10 నెలలుగా కరోనాతో వణికిపోతున్న ప్రజలకు ఊరట కలుగుతుందనే నమ్మకం ఉంది. వ్యాక్సిన్‌పై ఎలాంటి సందేహాలు వద్దని అందరికీ చెప్పగలుగుతాను.
భిక్కనూరులో వ్యాక్సిన్‌ ప్రారంభం
భిక్కనూరు, జనవరి 16: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని శనివారం ఎంపీపీ గాల్‌రెడ్డి ప్రారంభించారు. భిక్కనూరు మండలంలోని తొలి వ్యాక్సిన్‌ను మండల వైద్యాధికారి శ్రీనివాస్‌కు ఇచ్చారు. భిక్కనూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 45మంది వైద్య సిబ్బంది వ్యాక్సిన్‌ తీసుకుకోవాల్సి ఉండగా 31 మంది మాత్రమే వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. మిగతా వారిలో ముగ్గురు గైర్హాజరు కాగా ముగ్గురు అనారోగ్యం కారణం చేత, ఇద్దరు డిప్యూటేషన్‌లో ఉండటంతో, మరో ఆరుగురు తదితర కారణాలతో మొత్తంగా 14మంది వ్యాక్సిన్‌ను వేయించుకోలేదు.  భిక్క నూరులో వైద్యుడు శ్రీనివాస్‌ తొలి వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. అనంతరం ఇద్దరు చొప్పున భౌతికదూరం పాటిస్తూ వైద్యసిబ్బంది వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. మధ్యాహ్నం వరకు 23మంది వ్యాక్సిన్‌ వేసుకోగా భోజనం అనంతరం మిగితా సిబ్బంది వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు. వ్యాక్సిన్‌ను వేయించుకున్న వైద్య సిబ్బంది 30 నిముషాల పాటు పర్యవేక్షణలో ఉన్నారు. ఈ మేరకు ఎంపీపీ గాల్‌రెడ్డి, జడ్పీటీసీ పద్మనాగభూషణంగౌడ్‌ మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను వేసుకున్న వైద్యుడు శ్రీనివాస్‌, వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ కిష్టాగౌడ్‌, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ హన్మంత్‌రెడ్డి, ఎస్సైలు నవీన్‌కుమార్‌, హైమద్‌, సర్పంచ్‌ తునికి వేణు, విండో చైర్మన్‌ భూమయ్య, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T05:19:12+05:30 IST