ప్రైవేట్‌ సిబ్బందికి వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-01-25T05:45:16+05:30 IST

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి సోమవారం నుంచి కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 4,261 మంది పని చేస్తున్నట్లు అధికారులు గుర్తించగా, వీరందరికీ వ్యాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే వీరికి వ్యాక్సిన్‌ వేస్తారు. నల్లగొండ డివిజన్‌లో 3,357 మంది ప్రైవేటు సిబ్బంది ఉన్నా రు.

ప్రైవేట్‌ సిబ్బందికి వ్యాక్సినేషన్‌

నేటి నుంచి ప్రారంభం

53 శాతం ప్రభుత్వ సిబ్బందికి పూర్తి 

నల్లగొండ అర్బన్‌, జనవరి 24: ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి సోమవారం నుంచి కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 4,261 మంది పని చేస్తున్నట్లు అధికారులు గుర్తించగా, వీరందరికీ వ్యాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే వీరికి వ్యాక్సిన్‌ వేస్తారు. నల్లగొండ డివిజన్‌లో 3,357 మంది ప్రైవేటు సిబ్బంది ఉన్నా రు. నకిరేకల్‌, కనగల్‌, చండూరు, చిట్యాల, మునుగోడు పీహెచ్‌సీల్లో వీరికి వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నార్కట్‌పల్లి కామినేనితోపాటు జిల్లా కేంద్రంలోని రెండు అర్బన్‌ హెల్త్‌సెంటర్లలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇక మిర్యాలగూడ డివిజన్‌లో 491 మంది ఉన్నారు. ఇక్కడ రెండు అర్బన్‌ సెంటర్లు, హాలియా పీహెచ్‌సీ, మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి, జ్యోతి ఆస్పత్రు ల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారు. దేవరకొండ డివిజన్‌లో 152 మంది ఉండగా, దేవరకొండ ఏరియా ఆస్పత్రితోపాటు చింతపల్లి, గుర్రంపోడు పీహెచ్‌సీలో కేంద్రాలు ఏర్పాటు చేశారు.

మూడు వేల పైచిలుకు వెనకడుగు

ఇప్పటివరకు ఐదు రోజులపాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగింది. ఈ ఐదు రోజుల్లో ప్రభుత్వ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేశారు. 4,974 మంది వ్యాక్సిన్‌ వేయించుకోగా, 53శాతంగా నమోదైంది. ప్రభుత్వ వైద్య సిబ్బంది ఇంకా సుమారు 3వేల పైచిలుకు వ్యాక్సిన్‌ తీసుకోలేదు. 

Updated Date - 2021-01-25T05:45:16+05:30 IST