జంట రోగాలుంటేనే టీకా

ABN , First Publish Date - 2021-03-03T07:16:24+05:30 IST

రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌లో దీర్ఘకాలిక వ్యా ధులు(కో-మార్బిడిటీస్‌) కలిగిన 45-59 ఏళ్లలోపు వారికీ టీకాలు ఇస్తున్నా రు. దీర్ఘకాలిక వ్యాధులంటే మధుమేహం, కిడ్నీ సమస్యలు, హృద్రోగాల వం టివి. ఇలాంటి 20 రకాల..

జంట రోగాలుంటేనే టీకా

20 రకాల కో-మార్బిడిటీ్‌సకు షరతులు

జాబితాలో కానరాని ఒబెసిటీ, ఆస్తమా, సీవోపీడీ


న్యూఢిల్లీ, మార్చి 2: రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌లో దీర్ఘకాలిక వ్యా ధులు(కో-మార్బిడిటీస్‌) కలిగిన 45-59 ఏళ్లలోపు వారికీ టీకాలు ఇస్తున్నా రు. దీర్ఘకాలిక వ్యాధులంటే మధుమేహం, కిడ్నీ సమస్యలు, హృద్రోగాల వం టివి. ఇలాంటి 20 రకాల కో-మార్బిడిటీ్‌సతో కేంద్ర ఆరోగ్యశాఖ జాబితా కూడా విడుదల చేసింది. కానీ.. షరతులు వర్తిస్తాయని పేర్కొంది. ఆ షరతుల ప్రకారం షుగర్‌ లేదా బీపీ.. ఇలా ఏదో ఒక సమస్య ఉంటే చాలదట. వాటితో ముడిపడిన, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండాలట. ఉదాహరణకు మధుమేహంతో బాధపడేవారికి టీకా ఇవ్వరు. పదేళ్లకు పైగా మధుమేహంతో బాధపడుతుండటంతో పాటు, అధిక రక్తపోటు(హైపర్‌ టెన్షన్‌) కలిగిన వారు మాత్రమే వ్యాక్సినేషన్‌కు అర్హులని కేంద్రం చెబుతోంది.


దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ హీమో డయాలిసి్‌సపై ఉన్నవారికే టీకా ఇస్తారట. బ్రెయిన్‌ స్ట్రోక్‌ బాధితులకు అధిక రక్తపోటు, మధుమేహంలలో ఏదైనా ఒకటి ఉంటేనే వ్యాక్సినేషన్‌కు అర్హత పొందుతారు. బ్రెయిన్‌ హేమరేజ్‌ వంటి సమస్యల వల్ల కూడా ఎంతోమంది స్ట్రోక్‌ బారినపడుతుంటారనే విషయాన్ని కో-మార్బిడిటీస్‌ జాబితా రూపకర్తలు విస్మరించడం గమనార్హం. అధిక రక్తపోటు కలిగిన వారికి మధుమేహం లేదా యాంజైనా(ఛాతీ నొప్పి) ఉంటేనే టీకా ఇస్తామ నే షరతు పెట్టారు. ఇక ఒబెసిటీ, ఆస్తమా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డీసీజ్‌ (సీవోపీడీ) వంటి సమస్యల ప్రస్తావనే లేదు. 


బ్రిటన్‌ నమూనా ప్రయోజనకరం.. 

ప్రతి వ్యాధికి అదనంగా ఇంకొన్ని ఆరోగ్య సమస్యలుంటేనే టీకాకు అర్హులనే షరతు పెట్టడంతో కో-మార్బిడిటీస్‌ జాబితా పరిధి కుచించుకుపోయిందని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా విస్తృత స్థాయిలో 45-59 ఏళ్లలోపు ప్రజలకు వ్యాక్సినేషన్‌ జరిగే అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. ‘‘టీకాల లభ్యత తగినంతగా లేనప్పుడు ఒక వ్యాధికి, మరో వ్యాధితో లంకె పెడితే బాగుంటుంది. సరిపడా డోసులు అందుబాటు లో ఉన్నప్పుడూ దీర్ఘకాలిక వ్యాధులకు పరిమితులు ఎందుకు విధిస్తున్నారో అర్థం కావట్లేదు’’ అని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా(పీహెచ్‌ఎ్‌ఫ ఐ) బెంగళూరు విభాగం సాంక్రమిక వ్యాధి నిపుణుడు డాక్టర్‌ గిరిధర బాబు పేర్కొన్నారు. తొలిదశలో తీవ్ర వ్యాధులకే జాబితాలో చోటు దక్కింద ని కో-మార్బిడిటీస్‌ జాబితా రూపకల్పనలో భాగస్వామ్యమైన పీహెచ్‌ఎ్‌ఫఐ ఢిల్లీ విభాగం వైద్య నిపుణుడు డాక్టర్‌ డి.ప్రభాకరన్‌ అన్నారు. ఒకటి, రెండు నెలల్లో మరిన్ని వ్యాధులను చేర్చే అవకాశాలు ఉన్నాయన్నారు. తమ కు దీర్ఘకాలిక వ్యాధులున్నాయనే విషయం చాలా మందికి తెలియదని.. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటన్‌ తరహా వ్యాక్సినేషన్‌ నమూనాను భారత్‌ అనుసరిస్తే బాగుండేదని వైద్యనిపుణులంటున్నారు. కో-మార్బిడిటీస్‌ ప్రకారం కాకుండా వయసు ప్రాతిపదికన టీకా కార్యక్రమాన్ని చేపడితే అతి సులువుగా మరింత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూ రేదన్నారు.  


నమూనా ధ్రువపత్రం అప్‌లోడ్‌ చేస్తేనే.. 

హైదరాబాద్‌ సిటీ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ రాసిచ్చిన ప్రిస్ర్కిప్షనో, మందుల రశీదో తీసుకెళ్తే కరోనా వ్యాక్సిన్‌ ఇస్తారనుకుంటే తప్పులో కాలేసినట్టే. కో-మార్బిడిటీ ఉందని నిరూపించుకునేందుకు లబ్ధిదారులు న మూనా ధ్రువపత్రం-1(బి)ని భర్తీ చేయాలి. దీన్ని కొవిన్‌ పోర్ట ల్‌ లేదా టీకా కేంద్రం నుంచి పొందొచ్చు. ఏ వ్యాధి ఉంది? ఎంతకాలంగా బాధపడుతున్నా రు? తదితర వివరాలన్నీ పేర్కొనాలి. దాన్ని ఆర్‌ఎంపీ వైద్యుడి ద్వారా సర్టిఫై చేయించుకోవాలి. ఈ ధ్రువపత్రాన్ని ‘కొవిన్‌’లో అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాతే లబ్ధిదారుడికి టీకా ఇస్తారు. ప్రైవేటు టీకా కేంద్రాల్లోనైతే అక్కడి ఆర్‌ఎంపీ వైద్యులే లబ్ధిదారుడి కేస్‌ షీట్‌, పాత ప్రిస్ర్కిప్షన్లను చూసి ధ్రువీకరిస్తారు.

Updated Date - 2021-03-03T07:16:24+05:30 IST