ఏపీ ఎస్పీ 11వ బెటాలియన్‌లో వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-02-26T05:10:58+05:30 IST

ఏపీ ఎస్పీ 11వ బెటాలియన్‌లో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి బెటాలియన్‌లోని కోదండరామ కల్యాణ మండపంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరిగిం ది.

ఏపీ ఎస్పీ 11వ బెటాలియన్‌లో వ్యాక్సినేషన్‌

సిద్దవటం, ఫిబ్రవరి 25:  ఏపీ ఎస్పీ 11వ బెటాలియన్‌లో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి బెటాలియన్‌లోని కోదండరామ కల్యాణ మండపంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరిగిం ది. ఈ సందర్భంగా అదనపు కమాండెంటు ప్రభుకుమార్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అనంతరం ప్రభుకుమార్‌ మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు వద్దని పోలీసు అధికారులు, సిబ్బంది తప్పక వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు రెడ్డినాయక్‌, కేశవరెడ్డి, డీఎస్పీ వెంకటరెడ్డి, పోలీసు అధికారులు, బెటాలియన్‌ పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.వి.శివారెడ్డి, మాధవరం ప్రాథమిక వైద్యశాల వైద్యుడు శివకుమార్‌, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-02-26T05:10:58+05:30 IST