జీనోమ్‌ వ్యాలీలో వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-04-23T04:59:51+05:30 IST

జీనోమ్‌ వ్యాలీలో వ్యాక్సినేషన్‌

జీనోమ్‌ వ్యాలీలో వ్యాక్సినేషన్‌
తుర్కపల్లి పరిధిలోని జీనోమ్‌ వ్యాలీలో టీకా వేస్తున్న వైద్య సిబ్బంది

  • 90మంది సైంటిస్టులు, ఉద్యోగులకు టీకా 

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఐకేపీ నాలెడ్జ్‌ పార్క్‌(జీనోమ్‌ వ్యాలీ)లో పనిచేస్తున్న 90మంది సైంటిస్టులతోపాటు ఉద్యోగులకు గురువారం వ్యాక్సిన్లు వేశారు. కాగా జీనోమ్‌ వ్యాలీలో కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న భారత్‌ బయోటెక్‌తోపాటు బయోలాజికల్‌ ఈ-లిమిటెట్‌, తదితర సంస్థలు ఉన్నాయి. దీంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న వారికి క్యాంప్‌ ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. శామీర్‌పేట్‌ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సహకారంతో జీనోమ్‌ వ్యాలీలో రెండోసారి వ్యాక్సినేషన్‌ క్యాంప్‌ను ఏర్పాటుచేశారు. వైద్యులు డాక్టర్‌ శ్రీకాంత్‌, సిబ్బందికి ఐసీఎంఆర్‌ అడ్వైజర్‌ బీపీ ఆచార్య ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అర్హత గల వారందరూ కూడా కరోనా నివారణ టీకాలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు.

Updated Date - 2021-04-23T04:59:51+05:30 IST