వ్యాక్సినేషనే శ్రీరామ రక్ష!

ABN , First Publish Date - 2021-04-22T05:27:38+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. నిత్యం వందల సం ఖ్యలో పాజిటివ్‌ కేసు నమోదవుతున్నాయి. ఇది వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పదివేలను దాటింది. అదే మాదిరిగా మరణాల సంఖ్య పెరగడం మరింత ఆందో ళనకు గురిచేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం రిమ్స్‌, ఉట్నూ ర్‌ ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు.

వ్యాక్సినేషనే శ్రీరామ రక్ష!

జిల్లాలో 41,943 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి

ప్రజల్లో తొలగిపోతున్న అపోహలు

నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పంటున్న వైద్యులు

డోసులకు ఇబ్బంది లేదంటున్న అధికారులు

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. నిత్యం వందల సం ఖ్యలో పాజిటివ్‌ కేసు నమోదవుతున్నాయి. ఇది వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పదివేలను దాటింది. అదే మాదిరిగా మరణాల సంఖ్య పెరగడం మరింత ఆందో ళనకు గురిచేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం రిమ్స్‌, ఉట్నూ ర్‌ ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సినేషనే శ్రీరామరక్ష అంటూ అధికారులు పేర్కొంటున్నారు. ప్రారంభంలో వ్యాక్సినే షన్‌కు అంతగా ఆసక్తి చూపించని ప్రజలు ప్రస్తుతం ముందుకు వస్తున్నారు. మొదట ఫ్రంట్‌ లైన్‌ వారియ ర్స్‌కు మాత్రమే వ్యాక్సినేషన్‌ వేసిన ఆ తర్వాత 60 ఏళ్లకు పైబడిన వారితో 45 నుంచి 59 యేళ్లలోపు వారికి వ్యాక్సినేషన్‌ వేస్తున్నారు.ఇటీవల 18 ఏళ్లు దాటి న వారికి వ్యాక్సినేషన్‌ వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాని ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. జిల్లాలో ప్రస్తుతం 26  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు రిమ్స్‌, బోథ్‌, ఉట్నూర్‌ సీహెచ్‌సీ మొత్తం 29 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 41వేల 943 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తి చేశారు.  సెకండ్‌ వేవ్‌ వేగంగా విస్తరిస్తున్న సమయంలో మాస్కులు, వ్యాక్సినేషనే వైరస్‌ కట్టడికి సరైన మార్గాలని అధికారులు చెబుతున్నారు. 

భయంతో పరుగులు..

మొదటి దశ కంటే రెండవ దశల్లోనే కరోనా వైరస్‌ ఉధృతి అధికంగా కనిపిస్తోంది. అలాగే మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంది. నిత్యం జిల్లాలో ముగ్గురు, నలుగురు కరోనా బారిన పడి మరణిస్తు న్నారు. దీంతో వ్యాక్సినేషన్‌ తీసుకుంటే ప్రాణాలకు రక్షణ ఉంటుందనే భావనతో ప్రజలు కనిపిస్తున్నారు. ఒకటి రెండు రోజులు కొంత నీరసం, జ్వరం వస్తుంది. కానీ కరోనా పాజటివ్‌ వచ్చిన తమను ఏమి చేయలేదనే ధీమా కనిపిస్తోంది. కానీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొంత ఆలస్యమవు తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి న్ని కేంద్రాలను పెంచి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజలు కేంద్రాల వద్ద గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో కరోనా వైరస్‌ ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇకనైనా వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లను చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

అందుబాటులో 15వేల డోసులు..

జిల్లాలో జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించి ఏప్రిల్‌ 21 వరకు 41వేల 943 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారు. గడిచిన నాలుగు మాసా ల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొంత నెమ్మదిగానే కొనసా గినట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రజల్లో అపోహలు తొలగిపోవడంతో ఆదరణ కనిపిస్తోంది. ఇప్పటి వరకు 35వేల 559 మందికి మొదటి డోసు పూర్తి చేయగా 6381 మందికి రెండవ డోసును పూర్తి చేశారు. మొత్తం 2 డోసులు కలిపి 41వేల 943 మందికి వ్యాక్సి నేషన్‌ పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెబుతు న్నాయి. ఇంకా 15వేల డోసులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కోవిషీల్డ్‌, కోవ్యాగ్జిన్‌ డోసులు అందుబాటులో ఉన్నా యి. మరో వారం 10 రోజుల వరకు డోసులు సరిపో యే అవకాశం ఉందంటున్నారు. త్వరలోనే మరిన్ని డోసులను ప్రభుత్వం సరఫరా చేస్తుందని వైద్య ఆరోగ్యశాఖాధికారులు పేర్కొంటున్నారు. అయితే జిల్లా లో మొదటి డోసును 65 శాతం పూర్తి కాగా రెండవ డోసు 46 శాతం పూర్తయినట్లు అధికారులు పేర్కొం టున్నారు.

టీకాపై అపోహలువద్దు..

-రాథోడ్‌ నరేందర్‌ (డీఎంఅండ్‌హెచ్‌వో)

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. దీనిపై ఎలాంటి అపోహలు వద్దు. గర్భిణులు, యాక్టివ్‌ కేసుల వారికే వ్యాక్సినేషన్‌ వద్దంటున్నాం. కాగా మిగిలిన ఎలాంటి దీర్ఘకాలిక రోగులైన వ్యాక్సి నేషన్‌ తీసుకోవచ్చు. కరోనా పాజిటివ్‌ వచ్చిన దీనితో పూర్తి ప్రాణరక్షణ ఉంటుంది. మే1 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాం.

Updated Date - 2021-04-22T05:27:38+05:30 IST