వేగవంతంగా వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-09-18T05:16:55+05:30 IST

వ్యాక్సినేషన్‌ వేగవంతంగా సాగుతోంది.

వేగవంతంగా వ్యాక్సినేషన్‌

ఆచంట/మొగల్తూరు/కాళ్ళ/యలమంచిలి/పాలకొల్లు అర్బన్‌, సెప్టెంబరు 17 : వ్యాక్సినేషన్‌ వేగవంతంగా సాగుతోంది. సచివాలయాల పరిధిలో వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు. ఆచంట మండ లంలో సుమారు 3 వేల మందికి వ్యాక్సిన్‌ వేసినట్టు సంబందిత వైద్యాదికారులు తెలిపారు. మొగల్తూరు, తూర్పుతాళ్లు పీహెచ్‌సీల పరిధిలోని 17 గ్రామాలకు సంబంధించి 1440 మందికి కోవిషీల్డ్‌ టీకాలు వేసినట్టు తహసీల్దార్‌ ఎస్‌కె హుస్సేన్‌ తెలిపారు. కాళ్ళ  మండలంలో  2200 మందికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేసినట్టు పీహెచ్‌సీ డాక్టర్‌ ఎన్‌.గులాబ్‌రాజ్‌కుమార్‌ తెలిపారు. యలమంచిలి పీహెచ్‌సీ పరిధి 11 కేంద్రాల్లో 1500 మందికి, మేడపాడు పరిధి 9 కేంద్రాల్లో 1511 మందికి, దొడ్డిపట్ల పీహెచ్‌సీ పరిధి 9 కేంద్రాల్లో 1500 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు ఆయా పీహెచ్‌సీల వైద్యాధికారులు తెలిపారు.పాలకొల్లు పట్టణ 12 సెంటర్లలో 1200  మందికి వ్యాక్సిన్లు వేసినట్టు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యాధికారిణి డాక్టర్‌ అశ్వని, మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌. ప్రమోద్‌ కుమార్‌ తెలిపారు.ఆదిత్య కాలనీ పీహెచ్‌సీ పరిధి 6 కేంద్రాల్లో 600 మందికి, వీవర్స్‌ కాలనీ 6 కేంద్రాలలో 600 మందికి వ్యాక్సిన్లు వేశారన్నారు.   


నూరుశాతం వ్యాక్సినేషన్‌ జరగాలి : సబ్‌ కలెక్టర్‌


నరసాపురం, సెప్టెంబరు 17: ప్రతి సచివాలయ పరిధిలో నూరుశాతం వ్యాక్సి నేషన్‌ జరగాలని సబ్‌కలెక్టర్‌ విష్టుచరణ్‌ ఆదేశించారు. చినమామిడిపల్లి సచి వాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి వ్యాక్సినేషన్‌ తీరుపై ఆరా తీశారు. ఎంత మంది సింగిల్‌, డబుల్‌ డోస్‌ వేయించుకున్నారన్న వివరాలు ప్రతి సచివాలయంలో ఉండాలన్నారు. 84 రోజులు పూర్తికాగానే రెండో డోస్‌ ఇవ్వాలన్నారు.వ్యాక్సిన్‌ వేయించుకోలేని వారి వివరాలను డిస్‌ప్లే చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ మల్లికార్జునరెడ్డి, కమిషనర్‌ సత్యవేణి ఉన్నారు.


Updated Date - 2021-09-18T05:16:55+05:30 IST