ltrScrptTheme3

వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి : జేసీ

Nov 25 2021 @ 00:13AM
కొత్తవలస పీహెచ్‌సీలో సమీక్షిస్తున్న జేసీ మహేష్‌ కుమార్‌

కొత్తవలస : కరోనావ్యాక్సినేషన్‌ నూరుశాతం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ మహేష్‌కుమార్‌ కొత్తవలస పీహెచ్‌సీ వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం ఆయన కొత్తవలస పీహెచ్‌సీ పనితీరును పరిశీలించారు. తహసీల్దార్‌ రమణరావుతో కలసి కొత్తవలస పీహెచ్‌సీ నూతన భవనానికి కేటాయించిన స్థలాన్నిసందర్శించారు. అనంతరం కొత్తవలస పీహెచ్‌సీకి వెళ్లి ఇంతవరకు పీహెచ్‌సీ పరిధిలో ఎంతమందికి కరోనా వ్యాక్సిన్‌ వేశారోనని అడిగి తెలుసుకున్నారు. మందులు, స్టాక్‌ వంటి వివ రాలను పరిశీలించారు. వైద్య సిబ్బందితోపాటు ఎంపీడీవో వెంకటరావు, తహసీల్దార్‌ రమణరావు, వైద్యాధికారి పాల్గొన్నారు. 


ఎల్‌.కోటలో...

లక్కవరపుకోట : మండలంలో జేసీ మహేష్‌కుమార్‌ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా కల్లెపల్లి సచివాలయాన్ని పరిశీలించి అందుతున్న సేవల ను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డిజిట ల్‌ అసిస్టెంట్‌ లేకపోవ డం, సచివాలయ భవ నం పూర్తికాకపోవడం, గ్రామానికి చెందిన క ల్లేపల్లి రామలక్ష్మి, సబ్బ వరపు లక్ష్మిలకు రెండేళ్ల నుంచి రేషన్‌కార్డులు రాకపోవడం వంటి సమస్యలు జేసీ దృష్టికి తీసుకువచ్చారు. సమస్య లను వెంటనే పరిష్కరిస్తానని, అభివృద్ధి పనులు వేగంగా జరగాలని అధికారులకు సూచించారు. అనంతరం కల్లేపల్లి గ్రామానికి మంజూరైన 30 పడకల ఆసుపత్రికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. కల్లేపల్లి రెవెన్యూ సర్వేనెంబరు 47-1, 6లలో ఆసుపత్రికి కావాల్సిన స్థలాన్ని తహసీల్దార్‌ రామకృష్ణ, సర్వేయర్‌ రామా జేసీకి చూపించారు. అనంతరం రేగ సచివాలయాన్ని పరిశీలించారు. రేగలో పారిశుధ్య పనులు పూర్తిగా నశించిపోయాయని, ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఎంపీటీసీ బొడ్డు గణపతి జేసి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంపీడీవో అక్కారావు కు ఆదేశించారు. కల్లేపల్లి సర్పంచ్‌ జి.ముస లనాయుడు, ఆర్‌ఐ, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.