వ్యాక్సినేషన్‌ పరిశీలన

Jun 20 2021 @ 21:53PM
జొన్నవాడ పీహెచ్‌సీని తనిఖీ చేస్తున్న రాష్ట్ర నోడల్‌ అధికారి, జిల్లా వైద్యాధికారులు

బుచ్చిరెడ్డిపాళెం : జొన్నవాడ పీహెచ్‌సీని పీవో స్టేట్‌ నోడల్‌ అఽధికారి డాక్టర్‌ పీవీఎస్‌ఎన్‌ శాస్ర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ రాజ్యలక్ష్మి, పీవోడీటీటీ డాక్టర్‌ ఉమామహేశ్వరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆదివారం పీహెచ్‌సీ పరిధిలోని అన్ని సచివాలయాలలో 45 ఏళ్లు దాటిన వారికి, 18ఏళ్లు పైబడి 0నుంచి 5 ఏళ్లు పిల్లలున్న తల్లులకు కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ స్పెషల్‌డ్రైవ్‌ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగానే అధికారులు తనిఖీ చేసి, వైద్యాధికారి డాక్టర్‌ నస్రీన్‌బానును  పలు వివరాలడిగి తెలుసుకున్నారు. ముందుగా వారు జొన్నవాడ ఆలయాన్ని సందర్శించి కామాక్షితాయి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో  డాక్టర్‌ శ్రీతేజ, సుబ్బమ్మ, ఆరోగ్యమేరి, ప్రభావతి, ఏఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.

వెంకటాచలం : మండలంలోని కాకుటూరు గ్రామ సచివాలయంలో ఆదివారం వీఎస్‌యూలోని జాతీయ సేవా పథకం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో రెండో దశ వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వీఎస్‌యూలోని అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందికి కోవిషీల్డ్‌ వాక్సిన్‌ను వేశారు. ఈ సందర్భంగా వీఎస్‌యూ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి మాట్లాడుతూ వీఎస్‌యూలో ప్రతి ఒక్కరికి కరోనా వాక్సినేషన్‌ ఇవ్వడం జరిగిందన్నారు.  వాక్సినేషన్‌కు సహకరించిన కసుమూరు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ శంకరయ్య, డాక్టర్‌ మల్లికార్జున్‌, ఫార్మసిస్ట్‌ శ్రీరాములుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వీఎస్‌యూ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డీనేటర్‌ డాక్టర్‌ అల్లం ఉదయ్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

పొదలకూరు, జూన్‌ 20 : టీకా దినోత్సవంలో భాగంగా పట్టణంలోని బిట్‌-3 సచివాలయంలో ఆదివారం జరిగిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ డా.ప్రభావతి పరిశీలించారు. మండలంలో 23 సచివాలయాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియ ఏవిధంగా జరుగుతుందో మహమ్మదాపురం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ రమేష్‌ని అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమంలో సీడీపీవో విజయలక్ష్మి, ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్‌ వెంకటేశ్వర్లు, అంగన్‌వాడీలు  పాల్గొన్నారు.

తోటపల్లిగూడూరు :  మండలంలో కొవిడ్‌ మెగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా సాగినట్లు ఎంపీడీవో కన్నం హేమలత  వెల్లడించారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రక్రియను పరిశీలించేందుకు ఆదివారం ఆమె మండలంలో పర్యటించారు.  ఆమె మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మండలంలో విజయవంతం అయ్యిందని తెలిపారు. 

విడవలూరు : కరోనా  నివారణకు 45 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ కొవిడ్‌ 19 వ్యాక్సిన్‌ని తప్పని సరిగా వేసుకోవాలని ఎంపీడీవో చిరంజీవి తెలిపారు. కొవిడ్‌ -19 టీకా ఉత్సవంలో బాగంగా  ఆదివారం మండలంలోని విడవలూరు, రామతీర్థం పీహేచ్‌సీలో పరిధిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 1900 మందికి టీకా వేశారు. పీహెచ్‌సీలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ని ఎంపీడీవో చిరంజీవి పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో వైధ్యాధికారులు నరేంద్ర, ప్రసన్నకుమార్‌ పాల్గొన్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.