వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2021-10-27T06:46:23+05:30 IST

జిల్లాల్లోని ప్రతి ఇల్లు సర్వే చేసి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వందశాతం పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు.

వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తిచేయాలి
సీఎస్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), అక్టోబరు 26: జిల్లాల్లోని ప్రతి ఇల్లు సర్వే చేసి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వందశాతం పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, జడ్పీ సీఈవోలు, జిల్లాపంచాయతీ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఆశా, అంగన్‌వాడీ, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌ఏ, రేషన్‌షా్‌ప డీలర్లతో కూడిన గ్రామస్థాయి మల్టీడిసిప్లీనరీ బృందాలు, స్పెషల్‌ అధికారుల పర్యవేక్షణలో ప్రతి ఇల్లు సర్వేచేయాలని సూచించారు.కరోనా మొదటి, రెండోడోస్‌లు ఎంతమంది వేసుకున్నారు, ఇంకా ఎవరు వేసుకోలేదన్న వివరాలను పూర్తిగా సేకరించాలన్నారు. రాష్ట్రంలో ఐదు కోట్ల 60లక్షల మందికి వ్యాక్సినేషన్‌ను లక్ష్యంగా నిర్ధారించుకోగా ప్రస్తుతం మూడు కోట్ల ఐదు లక్షల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తిచేశామన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వ్యాక్సినేషన్‌ను పరిశీలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. ప్రజలు సైతం స్వతహాగా ముందుకు వస్తున్నారని వివరించారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నామని వివరించారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు, జడ్పీ సీఈవో సురేష్‌, డీఎంఎచ్‌వో కోటా చలం, డీపీవో యాదయ్య, పీడీ కిరణ్‌కుమార్‌, పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T06:46:23+05:30 IST