వారం రోజుల్లో వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-01-22T05:01:44+05:30 IST

వారం రోజుల్లో వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

వారం రోజుల్లో వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి
ఆన్‌లైన్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి

  • వర్చువల్‌ మీట్‌లో విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి ఆదేశం

వికారాబాద్‌, జనవరి 21(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వారం రోజుల్లో వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె తన కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో జిల్లాలో చేపట్టిన వ్యాక్సినేషన్‌, ఫీవర్‌ సర్వే, ధాన్యం కొనుగోళ్లు తదితరాంశాలతో కలెక్టర్‌, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఒమైక్రాన్‌ వేరియంట్‌, థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్‌ ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని నిర్ణయించారని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ మొదటి డోస్‌ 103శాతం పూర్తికాగా, రెండో డోస్‌  57 శాతం మాత్రమే చేశారని, ప్రజాప్రతినిధుల సహకారంతో త్వరతగతిన రెండో డోస్‌ లక్ష్యాన్ని ఈ నెల 26వ తేదీ వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. 15-18సంవత్సరాల టీనేజర్లకు వ్యాక్సినేషన్‌పై ఆమె ఆరా తీశారు. హెల్త్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌లకు ప్రికాషనరీ డోస్‌ వేయాలని సూచించారు. జిల్లాలో ఫీవర్‌ సర్వే కోసం ఇంటింటికి బృందాలు వెళ్లి జ్వ రం, దగ్గు లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి,  కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ వస్తే మందుల కిట్‌ ఇచ్చి ఇంటి వద్దనే ఐసోలేషన్‌లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. 


  • ధాన్యం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ


వానకాలంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో 121 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి సబిత తెలిపారు. ఇంకా 9కేంద్రాల ద్వారా కొనుగోళ్లు కొనసాగుతున్నాయని చెప్పారు. కొనుగోల చేసి ధాన్యానికి డబ్బులు కూడా రైతుల బ్యాంకు ఖాతాల్లో  జమ చేస్తున్నట్టు తెలిపారు. యాసంగిలో రైతులు వరికి బదులు కూరగాయలు, ఇతర పంటలు పండించుకునేలా అధికారులు అవగాహన క ల్పించాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ నిఖిల, ఎమ్మెల్యేలు ఆనంద్‌, మహే్‌షరెడ్డి, నరేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, జిల్లా అదనపు క లెక్టర్లుమోతీలాల్‌, చంద్రయ్య, డీఎంహెచ్‌వో తుకారాంభట్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మురళీకృష్ణ, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, డీఆర్‌డీవో కృష్ణన్‌, డీఏవో గోపాల్‌, సివిల్‌ సప్లయిస్‌ డీఎం విమల పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:01:44+05:30 IST