వ్యాక్సినేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-08-03T06:37:07+05:30 IST

దేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అం దజేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి అన్నారు.

వ్యాక్సినేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలి
వ్యాక్సినేషన్‌కోసం వచ్చిన వారి వివరాలు తెలుసుకుంటున్న మనోహర్‌రెడ్డి

టీకాలకోసం రూ.35వేల కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం 

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌ రెడ్డి 

చౌటుప్పల్‌ టౌన్‌, ఆగస్టు 2: దేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అం దజేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సోమవా రం మనోహర్‌ రెడ్డి సందర్శించారు. వ్యాక్సినేషన్‌ చేయించుకున్న ప్రజలతో మాట్లాడి, సమాచారాన్ని తెలుసుకున్నారు. టీకా తీసుకున్న వారికి పండ్లు, పండ్ల రసాలను అం దజేశారు. అనంతరం మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు కేంద్ర ప్రభు త్వం రూ.35వేల కోట్లను కేటాయించిందని, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 47కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ఉచితంగా వేసినట్లు తెలిపారు. ఆక్సిజన్‌ కొరతను నివారించేందు కు ప్రతి ఆస్పత్రిలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ తయారీ యంత్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కరోనా మూడోదశను సైతం సమర్థంగా ఎదుర్కొనేందుకు మోదీ ప్రభు త్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. దేశంలో కరోనా మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అనేక చర్యలను తీసుకుందని, రాష్ట్రంలో మాత్రం కరోనా వైర్‌సను కట్టడి చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్‌, మండల అధ్యక్షుడు రిక్కల సుధాకర్‌ రెడ్డి, కౌన్సిలర్లు పి.శ్రీధర్‌ బాబు, ఆలె నాగరాజు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T06:37:07+05:30 IST