వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభం

Sep 16 2021 @ 23:56PM
పాతపాలెంలో వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి వచ్చిన వారితో మాట్లాడుతున్న జడ్పీ సీఈవో

- జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు 

- ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

- పరిశీలించిన ఉన్నతాధికారులు  

వడ్డేపల్లి/ ఎర్రవల్లిచౌరస్తా/ కేటీదొడ్డి/ అయిజ టౌన్‌, సెప్టెంబరు 16 : కరోనా కట్టడే లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం జిల్లా వ్యాప్తం గా వ్యాక్సినేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభమైంది. వడ్డేపల్లి లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ కేంద్రాన్ని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొదటి, రెండవ వేవ్‌లతో ప్రజల ప్రాణాలు హరించిన కరోనా మహమ్మారిని టీకా వేయించుకోవడం తీసుకోవడం ద్వారా తరిమికొ డదామని పిలుపునిచ్చారు. 


- ఇటిక్యాల మండలంలోని శేకుపల్లి గ్రామంలో గురువారం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఎంపీపీ స్నేహ శ్రీధర్‌రెడ్డి ప్రారంభించారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌పై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యాధికారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పం చ్‌ రవీందర్‌రెడ్డి, వైద్యాధికారులు పల్లా శ్రీనివాస్‌, నాగశేషయ్య తదితరులు పాల్గొన్నారు.


- ధరూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఎంపీపీ నజుమున్నిసాబేగం పరిశీలించారు. కార్యక్ర మంలో జడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పం చ్‌ పద్మమ్మ, ఎంపీటీసీ దౌలన్న, ఎంపీడీవో అబ్దుల్‌ జబ్బార్‌, ఈఓఆర్‌డీ కృష్ణమోహన్‌, కార్యదర్శి రవి ప్రకాష్‌ పాల్గొన్నారు.


- కేటీదొడ్డి మండలంలోని పాతపాలెం, కొండా పురం, ఇర్కిచేడు, నందిన్నె, కుచినెర్ల, చింతలకుంట గ్రామాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిం చారు. ఈ సందర్భంగా పాతపాలెంలో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు వచ్చిన వారితో జడ్పీసీఈవో విజయానాయక్‌ మాట్లాడారు. కరోనా కట్టడికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, వైస్‌ ఎంపీపీ రామకృష్ణనాయుడు, ఎంపీడీవో పాండు, పంచాయతీ కార్యదర్శి మదన్‌మోహన్‌ పాల్గొన్నారు.


- రాజోలి మండల కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని మండల వైద్య అధికారి డాక్టర్‌ మాలకొండయ్య ఎంపీడీవో గోవింద్‌రావుతో కలిసి పరిశీలిం చారు. ఇంటర్‌నెట్‌ సౌకర్యం సరిగాలేక వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆలస్యం అవుతోందని వైద్య సిబ్బంది ఆయన దృష్టికి తెచ్చారు. ట్యాబ్‌లో వ్యాక్సినేషన్‌ నమోదును త్వరగా ఎలా చేయాలో వారికి చూపించారు. అనం తరం ఎంపీడీవో గోవింద్‌రావు మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు బాధ్యతగా తీసుకుని రాజోలికి కరోనా రహిత మండలంగా పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీవో ఖాజాహుస్సేన్‌, ఏఎన్‌ఎంలు, ఆశ, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.


కరోనా నియంత్రణే లక్ష్యం

కరోనా నియంత్రణే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు పనిచే యాలని అయిజ మునిసిపల్‌ కమిషనర్‌ నర్సయ్య అన్నారు. మునిసిపల్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. మునిసిపాలిటీలోని 20 వార్డుల్లో 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి, కరోనా టీకా వేయించాలని సూచించారు. వ్యాక్సినేషన్‌ కోసం పీఆర్‌పీ, ఆశ, అంగన్‌వాడీ టీచర్లు, ఒక ప్రత్యేక అధికారితో కలిపి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకు పని చేస్తాయని తెలిపారు. అయిజ పట్టణంలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి ఇళ్లకు స్టిక్కర్‌ వేయా లని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏఈ గోపాల్‌, లక్ష్మన్న, మహేష్‌, ఇస్మాయిల్‌, లోకేష్‌, మహేంద్ర, నరేష్‌, అడివెన్న పాల్గొన్నారు. 

Follow Us on:

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.