తొలి రోజే తుస్‌

ABN , First Publish Date - 2021-04-12T06:33:07+05:30 IST

కొవిడ్‌ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన టీకా ఉత్సవానికి వ్యాక్సిన కొరత ఏర్పడింది. దీంతో ఆదివారం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు జరగాల్సిన వ్యాక్సినేషన ప్రక్రియకు వ్యాక్సిన సరఫరా కాకపోవడంతో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. వ్యాక్సిన కోసం పీహెచసీలు, సీహెచసీలు, ఏరియా ఆసుపత్రులతో పాటు వివిధ సబ్‌ సెంటర్లకు వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు.

తొలి రోజే తుస్‌
పి.గన్నవరం పీహెచసీకి వ్యాక్సిన వేయించుకునేందుకు వచ్చిన ప్రజలు

  • వ్యాక్సిన కొరతతో కోనసీమలో నిలిచిన టీకా ఉత్సవం
  • పీహెచసీలు, సీహెచసీలు, ఏరియా ఆసుపత్రుల వద్ద ప్రజల పడిగాపులు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన టీకా ఉత్సవానికి వ్యాక్సిన కొరత ఏర్పడింది. దీంతో ఆదివారం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు జరగాల్సిన వ్యాక్సినేషన ప్రక్రియకు వ్యాక్సిన సరఫరా కాకపోవడంతో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. వ్యాక్సిన కోసం పీహెచసీలు, సీహెచసీలు, ఏరియా ఆసుపత్రులతో పాటు వివిధ సబ్‌ సెంటర్లకు వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు.   45 ఏళ్లు దాటిన వారిలో ముందస్తు అనుమతి పొందిన వ్యక్తులకు ఎంపిక చేసిన కేంద్రాల ద్వారా తొలి దఫా వ్యాక్సిన వేశారు. మలి దఫా కూడా కొన్నిచోట్ల వేశారు. అయితే టీకా ఉత్సవాన్ని నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని అధికార యంత్రాంగం ప్రచారం చేసింది. దీంతో పాటు వైరస్‌ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రజల్లో భయాందోళన కలిగి కొవిడ్‌ వ్యాక్సిన కోసం వైద్య, ఆరోగ్య కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. అయితే వైద్య శాఖ వద్ద సరిపడా వ్యాక్సిన అందుబాటులో లేకపోవడంతో కోనసీమవ్యాప్తంగా టీకా ఉత్సవం ఆదివారం ప్రారంభం కాలేదు. ఒకటి, రెండు రోజుల్లో వ్యాక్సిన వచ్చే అవకాశం ఉందని వైద్య సిబ్బంది స్థానికులకు వివరిస్తున్నారు.


Updated Date - 2021-04-12T06:33:07+05:30 IST