యాపిల్‌లో ‘వ్యాక్సిన్‌ ఎమోజీ’

ABN , First Publish Date - 2021-05-01T05:30:00+05:30 IST

కొవిడ్‌ సంబంధిత అప్‌డేట్‌లతో ‘యాపిల్‌’ కంపెనీ ఐఓఎస్‌ 14.5 సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేసింది. మాస్క్‌ ఉన్నప్పుడు ఐఫోన్‌ని అన్‌లాక్‌ చేసుకోవడం, వ్యాక్సిన్‌కు సంబంధించిన

యాపిల్‌లో ‘వ్యాక్సిన్‌ ఎమోజీ’

కొవిడ్‌ సంబంధిత అప్‌డేట్‌లతో ‘యాపిల్‌’ కంపెనీ ఐఓఎస్‌ 14.5 సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేసింది. మాస్క్‌ ఉన్నప్పుడు ఐఫోన్‌ని అన్‌లాక్‌ చేసుకోవడం, వ్యాక్సిన్‌కు సంబంధించిన ఎమోజీలు ఇందులో ఉన్నాయి. ఇంతకుమునుపు ఎమోజీ రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్నట్టు ఉండేది.  ప్రస్తుతం వ్యాక్సిన్‌ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. చిన్నపాటి సూది, మందుతో గ్రే రంగులో బ్యారెల్‌ ఈ ఎమోజీలో ఉన్నాయి. మొత్తానికి వ్యాక్సినేషన్‌పై జరుగుతున్న చర్చను ప్రతిబింబించేలా ఉంది.


యాపిల్‌ డివైజెస్‌లో మాత్రమే ఈ కొత్త ఎమోజీ లభ్యమవుతోంది. దీనికితోడు మరో 440 ఎమోజీలను అప్‌డేట్‌ చేసింది. గుండెల్లో మంటలు, మబ్బుల చాటున ముఖం, వేర్వేరు స్కిన్‌టోన్స్‌ కలిగిన దంపతుల కాంబినేషన్స్‌ ఈ ఎమోజీల్లో ఉన్నాయి. యాపిల్‌కు ఇంతవరకు హెడ్‌పోన్‌ ఎమోజీ ఉంది. దానికి బదులుగా ఇటీవలి విడుదల చేసిన యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ మేక్స్‌ను ఎమోజీగా పెట్టుకుంది.

Updated Date - 2021-05-01T05:30:00+05:30 IST