నేటి నుంచే టీకా

ABN , First Publish Date - 2021-03-01T07:05:51+05:30 IST

కొవిడ్‌ టీకా రెండో దశ కార్యక్రమం సోమవారం ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి టీకా రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కొవిన్‌ వెబ్‌సైట్‌ తెరుచుకోనుంది.

నేటి నుంచే టీకా

  • 60 ఏళ్ల పైబడినవారు, 45-59 ఏళ్ల కోమార్బిడిటీస్‌కు 
  • ఉదయం 10 గంటల నుంచి కొవిన్‌లో రిజిస్ట్రేషన్‌
  • 10.30 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌
  • ఒక్కో కేంద్రంలో రోజుకు 200 మందికే టీకా
  • హుజూరాబాద్‌లో టీకా తీసుకోనున్న మంత్రి ఈటల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ టీకా రెండో దశ కార్యక్రమం సోమవారం ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి టీకా రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కొవిన్‌ వెబ్‌సైట్‌ తెరుచుకోనుంది. 10.30 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 48 ప్రభుత్వ ఆస్పత్రులు, 45 ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఒక్కో కేంద్రంలో ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న 200 మందికే టీకాలిస్తారు. తొలివారం ఆన్‌లైన్‌లో, అడ్వాన్స్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికే టీకాలిస్తారు. ఆ తర్వాత నుంచి కేంద్రాల వద్ద కూడా రిజిరేస్టషన్‌ చేసుకోవచ్చు.  సోమవారం ఉదయం 10 గంటలకు కొవిన్‌ పోర్టల్‌, ఆరోగ్య ేసతు యాప్‌లో రిజిస్ట్రేషన్‌ సౌకర్యం అందుబాటులోకి రానుంది. తొలిరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. వ్యాక్సినేషన్‌ జరుగుతున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ సెంటర్ల వివరాలు, వ్యాక్సినేషన్‌ తేదీలు, టైమ్‌ స్లాట్ల వంటివన్నీ పోర్టల్‌, యాప్‌లో వైద్యశాఖ అప్‌లోడ్‌ చేసింది. ఆన్‌లైన్‌లో కనీసం ఒక రోజు ముందుగా రిజిరేస్టషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మరుసటి రోజు స్లాట్స్‌ ముందురోజు మధ్యాహ్నం 12 గంటల వరకే అందుబాటులో ఉంటాయి. కాగా, వ్యాక్సినేషన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు.  వ్యాక్సినేషన్‌-2లో లబ్ధిదారులంతా 60 ఏళ్ల పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్న నేపథ్యంలో వైద్యసిబ్బంది ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. పంపిణీ ప్రక్రియ వేగంగా జరిగేందుకు కేంద్రాల వద్ద వ్యాక్సినేటర్ల సంఖ్యనుపెంచాలని, రిజిరేస్టషన్‌ ప్రక్రియ ఆలస్యం కాకుండా చూడాలని డీఎంహెచ్‌వోలకు సూచించారు.  


నగరంలో తొలి రోజు టీకా కేంద్రాలివే..

తొలిరోజు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చే కేంద్రాల జాబితాను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసింది. హైదరాబాద్‌లో గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆస్పత్రులతోపాటు ఈఎన్‌టీ ఆస్పత్రి, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, కింగ్‌ కోఠీ జిల్లా ఆస్పత్రి, మలక్‌పేట్‌, గోల్కొండ, నాంపల్లి ఏరియా ఆస్పత్రులు, పాల్థార్‌ యూపీహెచ్‌సీ, నిజామియా టీబీ ఆస్పత్రి, ఈఎ్‌సఐ మెడికల్‌ కాలేజీ,  బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి, జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రి, సోమాజిగూడ, సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రులు, ప్రిన్స్‌ ఎస్రా ఆస్పత్రి, మెడికవర్‌ ఆస్పత్రి, ప్రతిమ ఆస్పత్రి, బంజారాహిల్స్‌,   నాంపల్లిలోని కేర్‌ ఆస్పత్రులు, సెంచురీ ఆస్పత్రి, కిమ్స్‌ ఆస్పత్రిలో కొవిడ్‌ టీకా వేయనున్నారు. వీటితోపాటు మేడ్చల్‌లోని మల్లారెడ్డి ఆస్పత్రి, మమత మెడికల్‌ కాలేజీలో, రంగారెడ్డి జిల్లాలోని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి, కొండాపూర్‌ జిల్లా ఆస్పత్రి, భాస్కర జనరల్‌ ఆస్పత్రి, విరించి, కామినేని, మలక్‌పేటలోని యశోద ఆస్పత్రి, గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలోనూ టీకా ఇస్తారు. 

Updated Date - 2021-03-01T07:05:51+05:30 IST