ఓడలరేవులో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-04-21T05:59:54+05:30 IST

ఓడలరేవు మన్నా కాలనీకి చెందిన పెమ్మాడి బాబ్జి ఇంటిలో మంగళవారం విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది.

ఓడలరేవులో అగ్నిప్రమాదం

అల్లవరం, ఏప్రిల్‌ 20: ఓడలరేవు మన్నా కాలనీకి చెందిన పెమ్మాడి బాబ్జి ఇంటిలో మంగళవారం విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. రూ.2లక్షల ఆస్తి నష్టం ఏర్పడింది. రిఫ్రిజిరేటర్‌, టీవీ, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. టీడీపీ మండల అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబు రాజు  బాబ్జికి బియ్యం, నిత్యావసరాలు, రూ.2వేలు అందజేశారు. బెండమూ ర్లంకలో రేకుల షెడ్డులో పనిచేస్తూ గాయపడ్డ ఓడలరేవుకు చెందిన వడ్రంగి మేస్ర్తి చిలకలపూడి ఏడుకొండలుకు సత్తిబాబురాజు రూ.2వేలు అందించారు.

 

Updated Date - 2021-04-21T05:59:54+05:30 IST