ప్రారంభమైన పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-08T05:48:36+05:30 IST

కోనసీమ తిరుమల వాడపల్లిలో శ్రీవేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలను తిరుమల తరహాలో నిర్వహిస్తున్నారు. శ్రావణ శుద్ధ దశమి ఆదివారం ఉదయం 9.25 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్‌వరుణ, దీక్షాధారణ, అకల్మష హోమం, నీరాజన మంత్రపుష్పంలతో పవిత్రోత్సవాలను ఘనంగా ప్రారంభించారు.

ప్రారంభమైన పవిత్రోత్సవాలు

ఆత్రేయపురం, ఆగస్టు 7: కోనసీమ తిరుమల వాడపల్లిలో శ్రీవేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలను తిరుమల తరహాలో నిర్వహిస్తున్నారు. శ్రావణ శుద్ధ దశమి ఆదివారం ఉదయం 9.25 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్‌వరుణ, దీక్షాధారణ, అకల్మష హోమం, నీరాజన మంత్రపుష్పంలతో పవిత్రోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు, పండ్లతో సర్వాంగసుందరంగా అలంకరించారు. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం ఖండవిల్లి రాజేశ్వరవరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేద పండితులు, అర్చకులు పవిత్రోత్సవ పూజలు జరిపారు. సాయంత్రం మృత్సంగ్రహణము, అంకురార్పణ, వాస్తు పూజ, అగ్నిమథనం, అగ్నిప్రతిష్ఠాపన, వాస్తు హోమం, నవమూర్తి  ఆవాహన, పంచసయ్యాదివాసంలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అశేష సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - 2022-08-08T05:48:36+05:30 IST