వాడవాడలా జెండా పండుగ

ABN , First Publish Date - 2022-08-16T06:18:33+05:30 IST

భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు.

వాడవాడలా జెండా పండుగ
హిందూపురంలో వెయ్యి అడుగుల జాతీయ జెండా ప్రదర్శన


 

 (ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌, ఆగస్టు 15)  

భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. చిన్నారులు వివిధ దేశనాయకుల వేషధారణ ఆకట్టుకుంది. హిందూపురం పట్టణంలోని నాలుగు సింహాల ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎంఎస్‌ షఫీ ఆధ్వర్యంలో 75 కేజీల కేక్‌ను కట్‌చేశారు. అన్నదానం నిర్వహించారు. ఇందులో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఆర్‌ఎంఎస్‌ షఫీ, కొల్లకుంట అంజినప్ప, పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ పీసీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేవనహళ్లిఆనంద్‌, నాయకులు అమర్‌నాథ్‌, నాగరాజు, రామాంజినమ్మ, నబీరసూల్‌, టైలర్‌ గంగాధర్‌, రవీంద్ర, ప్రసాద్‌, శ్రీనివాసరెడ్డి, రమేష్‌ పాల్గొన్నారు. పెనుకొండ  టీడీపీ  కార్యాలయంలో హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆధ్వర్యంలో పతాకావిష్కరణ గావించారు. అనంతరం అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు జీవీపీ నాయుడు, మునిమడుగు వెంకటరాముడు, కేశవయ్య, బొక్సంపల్లి రామక్రిష్ణ, కురుబ క్రిష్ణమూర్తి, రవి, రఘు, కన్వీనర్‌ సిద్దయ్య పాల్గొన్నారు. స్థానిక హెచపీ పెట్రోల్‌ బంక్‌ వద్ద రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత జెండా ఎగురవేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు స్వర్గీయ శేష శయనం కుమారుడు సురే్‌షబాబును సత్కరించారు. అనంతరం పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఇందులో సీనియర్‌ నాయకులు మాదవ్‌నాయుడు, వెంకటరమణ, వెంకటరామిరెడ్డి, కన్వీనర్‌ శ్రీరాములు, గుట్టూరు సూరీ పాల్గొన్నారు. స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ నవీన, సబ్‌ కోర్టు ప్రాంగణంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి శంకర్‌రావు,  స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్‌నారరాయణ జెండా ఎగురవేశారు. పెనుకొండ  మండలంలోని గొందిపల్లిలో సర్పంచ గౌతమి, ఎంపీపీ గీత అధ్యక్షతన చెరువు వద్ద  ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ  కార్యక్రమాలు నిర్వహిచారు. ఉపాధి హామీ పథకం కింద రూ.3.92లక్షలతో పూడికతీత, పొలాలకు మట్టితరలింపు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. గోరంట్ల రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ రంగనాయకులు, మండల పరిషత కార్యాలయంలో ఎంపీడీఓ రఘునాథ్‌ గుప్తా ఆధ్వర్యంలో ఎంపీపీ ప్రమీళ, జెడ్పీటీసీ పాలే జయరాంనాయక్‌ పతాకావిష్కరణ గావించారు.  పాలసముద్రం ఉన్నత పాఠశాలలో  పూర్వ విద్యార్థి, రిటైర్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగి బత్తల సోమలింగారెడ్డి రూ.12 లక్షల సొంత నిధులతో నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. గోరంట్ల మండలంలోని ఎర్రబల్లిలో డా.బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ప్రారంభించారు. ఇందులో రామక్రిష్ణారెడ్డి, జనసేన సురేష్‌, టీడీపీ నాయకులు, పాల్గొన్నారు.  గోరంట్ల పట్టణంలోని జామియా మసీదు వద్ద జమియత ఉలమ వారు ఆజాదికా అమృత మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, మైనార్టీ నాయకులు ఎహెచబాష, నూర్‌మహ్మద్‌, జబ్బార్‌, నాగేనాయక్‌, జమియతఉలమ హిందూపురా కార్యదర్శి మౌలానా జాకీర్‌హుస్సేనసాబ్‌, గోరంట్ల అధ్యక్షులు మౌలానా షఫీవుల్లా, కమిటీ సభ్యులు, స్థానిక ముస్లిం పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.  మడకశిరలోని సరస్వతీ విద్యామందిరం పాఠశాల ఆవరణంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుం డుమల తిప్పేస్వామి జాతీయ జెండాను ఎగరవేశారు. ఇందులో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాస్‌మూర్తి, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు భక్తర్‌ పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర జూనియర్‌ కళాశాల  విద్యార్థులు 700 అడుగుల  జాతీయ జెండాను ప్రదర్శించారు. దీన్ని ఎస్‌ఐ నాగేంద్ర, కళాశాల ప్రిన్సిపల్‌ నారాయణరెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ మాధవ్‌ ప్రారంభించారు. మడకశిర మండలం నీలకంఠాపురంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఉన్నత పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. కదిరేపల్లి పాఠశాలలో గ్రామస్థుడు నరసింహమూర్తి 63 మంది విద్యార్థులకు సుమారు రూ. 4 వేల విలువైన నోట్‌ బుక్స్‌ పంపిణీ చేశారు. అగళిలో టీడీపీ జెడ్పీటీసీ ఉమేష్‌ ఆధ్వర్యంలో 520 అడుగుల జెండాను విద్యార్థులు ప్రదర్శించారు.సోమందేపల్లిలో ముస్లింలు వెయ్యి అడుగులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.పావగడ జూనియర్‌ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే వెంకటరమణప్ప, తహసీల్దార్‌ వరదరాజులు జెండా ఎగురవేశారు. చిలమత్తూరు, లేపాక్షి, రొద్దం, అమరాపురం, గుడిబండ, రొళ్ల తదితర మండలాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

Updated Date - 2022-08-16T06:18:33+05:30 IST