వడ్డీ జలగలు!

ABN , First Publish Date - 2021-04-18T05:54:12+05:30 IST

జిల్లాలో వడ్డీ వ్యాపారులు పేదలను దోపిడీ చేస్తున్నారు. ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల చేతికి చిక్కి పేదలతోపాటు సామాన్యులు, కొందరు ఉద్యోగులు వడ్డీలు చెల్లించలేక విలవిల్లాడుతున్నారు. జిల్లాకేంద్రంతోపాటు తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, గుంతకల్లు, కదిరి, పెనుకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాలలో వడ్డీ వ్యాపారులు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం.

వడ్డీ జలగలు!

జిల్లాలో యథేచ్ఛగా 

వడ్డీ వ్యాపారుల దోపిడీ!

ఫ అధిక వడ్డీలు.. ఆపై దౌర్జన్యాలు ఫ  పేదల 

అవసరాలను బట్టి ‘వడ్డి’ంపు  ఫ దృష్టి సారించని పోలీసులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన శాఖలు

అనంతపురం క్రైం, ఏప్రిల్‌ 17: జిల్లాలో వడ్డీ వ్యాపారులు పేదలను దోపిడీ చేస్తున్నారు. ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల చేతికి చిక్కి పేదలతోపాటు సామాన్యులు, కొందరు ఉద్యోగులు వడ్డీలు చెల్లించలేక విలవిల్లాడుతున్నారు. జిల్లాకేంద్రంతోపాటు తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, గుంతకల్లు, కదిరి, పెనుకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాలలో వడ్డీ వ్యాపారులు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం. ఆయా ప్రాంతాల్లో అడ్డుచెప్పేవారు లేకపోవడంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోతోం ది. రూ.3 నుంచి రూ.10 వరకు వడ్డీ లాగుతూ పేదలను దోపిడీ చేస్తున్నారు. నెలవారీ, డైలీ(రోజు) కలెక్షన్ల పేరుతో వడ్డీకి డబ్బులిచ్చి రూ.కోట్లు గడిస్తున్నా రు. ఈ వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు ఇళ్లు వదిలి వెళ్లిపోతుంటే.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు వ్యాపారులు రుణగ్రహీతల ఇళ్లు, స్థలాలను తాకట్టుపెట్టుకుని చివరకు దౌర్జన్యంగా వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు సమాచారం.


విచ్చలవిడిగా వడ్డీ

జిల్లాలో వడ్డీ వ్యాపారులు అప్పు కోసం వచ్చే వారి అవసరాలను బట్టి ఒక్కొక్కరితో ఒక్కోరకంగా వడ్డీ వసూలు చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారులు, తోపు డు బండ్లు, తదితర వ్యాపారులు ఎక్కువగా ఏరోజుకారోజు జరిగే వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తుంటారు. ఇలాంటి వారు పెట్టుబడి కోసం డైలీ ఫైనాన్స వారిని అశ్రయిస్తే.. ఉదయం రూ.900 ఇచ్చి.. సా యంత్రం రూ. 1000 వసూలు చేస్తున్నారు. త ద్వారా రోజుకు అదనంగా ఒక్కొక్కరూ రూ.100 చె ల్లించాల్సిన దుస్ధితి.  మరికొందరు నెలకు రూ.9000 ఇచ్చి నెల చివరి రోజున రూ.10,000 వసూలు చేస్తు న్నారు. ఈ లెక్కన పేదలు చేస్తున్న వ్యాపారంలో వచ్చే ఆదా యం సగం ఫైనాన్స వారికే చెల్లించాల్సి వస్తోంది.  డబ్బులు చెల్లించడంలో ఆలస్యమైనా, మళ్లీ వారి వద్దే అప్పు తీసుకోకపోయినా వారిపై పలు రకాలుగా ఒత్తిడి పెడుతున్నట్టు సమాచారం. 


అనుమతి లేకుండానే..

జిల్లాలో ఎలాంటి అనుమతి లేకుండానే వ్యాపారులు విచ్చలవిడిగా వడ్డీ వ్యాపారం సాగిస్తున్నారు. ప్రధానంగా ఫైనాన్స, తాకట్టు  వ్యాపారాలు చేయాలన్నా నిబంధనలు ప్రకారం అనుమతి తీసుకోవాల్సి ఉంది. రెవెన్యూ, రిజి సే్ట్రషన, పోలీసుశాఖ ద్వారా లైసెన్సలు కలిగి ఉండాలి.  లైసెన్సులు పొందిన వారు మా త్రమే నియమ నిబంధన లకు లోబడి వ్యాపారాలు కొనసాగించాలి. కానీ జిల్లాలో ఎక్కువమందికి ఎ లాంటి లైసెన్సలు లేవు. జిల్లా పోలీసు యంత్రాంగం ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఉంచి వారి దోపిడీకి కళ్లెం వేయాలని బాధితులు వాపోతున్నారు.  అధిక వడ్డీలకు సంబంధించి కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే సంబంధిత వడ్డీ వ్యాపారులు పోలీసులకు కాసులు సమర్పించి చర్యలు తీసుకోకుండా చూసుకుంటున్నారని కొందరు బాధితుల ద్వారా తెలిసింది. మరికొందరు పోలీసులైతే కేసులు నమోదు చేయకుండా వడ్డీ వ్యాపారులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.


ఉద్యోగులే లక్ష్యంగా...

జిల్లాలో కొందరు వడ్డీ వ్యాపారుల కొంత రకం దోపిడీకి తెరలేపారు. సామాన్యులు, మధ్యతరగతి వారికి వడ్డీకి ఇస్తే సక్రమంగా చెల్లించలేరనే ఉద్దేశంతో ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులున్న ఉద్యోగు లను తెలుసుకుని వారికి రూ.100కు రూ.3 నుంచి వారి అవసరాలను బట్టి మరింత రెట్టింపు వడ్డీలతో అప్పు ఇచ్చి  సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు వడ్డీ వ్యాపారులు  ఉద్యోగుల వద్ద ఏటీంఎ కార్డులు, బ్యాంకు పాస్‌ పుస్తకాలు తీసుకుని అప్పుగా డబ్బులు ఇస్తున్నారు. ఇలా పలు రకా ల గ్యారెంటీలతో వడ్డీ వ్యాపారులు జిల్లాలో ప్రజల శ్రమ ను దోచుకుని కోట్లకు పడగలెత్తారని సమాచారం. రుణ గ్రహీతలు మాత్రం వడ్డీలు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు.  

Updated Date - 2021-04-18T05:54:12+05:30 IST