తల్లిదండ్రులను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు యూఏఈ గోల్డెన్ వీసా!

ABN , First Publish Date - 2020-11-30T01:25:11+05:30 IST

దుబాయిలో తల్లిదండ్రులను కోల్పోయిన భారత్‌కు చెందిన అక్కాచెల్లెళ్లకు అక్కడి ప్రభుత్వం యూఏఈ గోల్డెన్ వీసాను అందించింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన హిరెన్ అధియా అతని భార్య విధి గత కొం

తల్లిదండ్రులను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు యూఏఈ గోల్డెన్ వీసా!

న్యూఢిల్లీ: దుబాయిలో తల్లిదండ్రులను కోల్పోయిన భారత్‌కు చెందిన అక్కాచెల్లెళ్లకు అక్కడి ప్రభుత్వం యూఏఈ గోల్డెన్ వీసాను అందించింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన హిరెన్ అధియా అతని భార్య విధి గత కొంత కాలంగా దుబాయిలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్ 18న రాత్రి వారు నిద్రుస్తుండగా.. ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగతనాన్ని అడ్డుకునే క్రమంలో హిరెన్‌ అధియాను దొంగలు పొడిచేశారు. భర్తను రక్షించుకునే క్రమంలో భార్య విధి కూడా కత్తిపోట్లకు గురయ్యారు. దొంగల చేతిలో తీవ్రంగా గాయపడ్డ ఆ భార్యాభర్తలు ప్రాణాలను కోల్పోయారు. దీంతో వారి ఇద్దరు కూతుళ్లు ఒంటిరి వారయ్యారు. ఈ క్రమంలో దుబాయ్ ప్రభుత్వం స్పందించింది. దుండగుల దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు యూఏఈ గోల్డెన్ వీసాను అందించింది. అక్కాచెల్లెళ్లకే కాకుండా వారి గ్రాండ్‌పేరెంట్స్‌కు కూడా అక్కడి ప్రభుత్వం యూఏఈ గోల్డెన్ వీసాను మంజూరు చేసింది. దీంతోపాటు ఆ అక్కాచెల్లెళ్లు దుబాయిలో చదువుకునేందుకు పూర్తి స్కాలర్‌షిప్‌ను కూడా పొందారు. ఈ నేపథ్యంలో దుబాయిలోని భారతీయ సమాజం స్పందిస్తూ.. అక్కడి ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది.


Updated Date - 2020-11-30T01:25:11+05:30 IST