రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుప్పి
మర్రిపాడు, మే 17 : మండలంలోని నందవరం సమీపంలో నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం చుక్కల దుప్పిని గుర్తు తెలియని వాహనం ఢీ కొనగా, అది అక్కడికక్కడే మృతి చెందింది. గుర్తించిన స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. వన్యప్రాణులకు అడవుల్లో నీరు దొరక్క రోడ్లపైకి రావడంతో ప్రమాదాల బారిన పడుతున్నాయి. అడవుల సమీపాన వన్య ప్రాణులకు నీటి సౌకర్యాన్ని కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.