పక్షం రోజుల్లో వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-07-27T03:54:27+05:30 IST

అసంపూర్తి దశలో ఉన్న వైకుంఠధామం నిర్మాణం పనులను ఆగస్టు 15 లోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులను ఆదేశించారు.

పక్షం రోజుల్లో వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలి
ముస్లాపూర్‌లో వైకుంఠధామం నిర్మాణం పనులను పరిశీలిస్తున్న జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

అల్లాదుర్గం, జూలై 26 : అసంపూర్తి దశలో ఉన్న వైకుంఠధామం నిర్మాణం పనులను ఆగస్టు 15 లోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం అల్లాదుర్గం మండలంలోని సీతానగర్‌, ముస్లాపూర్‌ గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న వైకుంఠదామం నిర్మాణం పనులను ఆమె పరిశీలించారు. సీతానగర్‌లో నిర్మిస్తున్న వైకుంఠధామం నిర్మాణ స్థలంపై వివాదం ఏర్పడడంతో నిర్మాణం పనుల్లో జాప్యం జరిగినట్లు సర్పంచ్‌ లక్ష్మయ్య జిల్లా అదనపు కలెక్టర్‌కు వివరించారు. అదనపు కలెక్టర్‌ వెంట ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీవో సయ్యద్‌, పీఆర్‌ ఏఈ మొగులయ్య, సర్పంచులు లక్ష్మయ్య, మల్శేశం ఉన్నారు.

పల్లె ప్రగతి పనుల పరిశీలన

పెద్దశంకరంపేట, జూలై 26: మండలంలోని టెంకటి, వీరోజిపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డు, వైకుంఠ గ్రామాల నిర్మాణాల పనులను, మొక్కల ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాంనారాయణ్‌, ఎంపీవో రియాజుద్దిన్‌, ఈజీఎ్‌సఏపీవో సుధాకర్‌, వెంకటేష్‌, సర్పంచు సుధాకర్‌, ఎంపీటీసీ అనితవిఠల్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-27T03:54:27+05:30 IST