కొవిడ్‌ పరీక్షల సామర్థ్యం పెంచేందుకు చర్యలు

ABN , First Publish Date - 2021-05-11T07:19:24+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ పరీక్షల సామర్థ్యం పెంచేందుకు నూతన ఆర్టీపీసీఆర్‌ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగినట్టు జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కాకినాడ జీజీహెచ్‌ వైరాలజీ ల్యాబ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన రియల్‌ టైమ్‌ పాలిమరేస్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్టీపీసీఆర్‌) టెస్ట్‌ల యంత్రాన్ని జేసీ కీర్తి చేకూరితో కలసి ప్రారంభించారు.

కొవిడ్‌ పరీక్షల సామర్థ్యం పెంచేందుకు చర్యలు
ఆర్టీపీసీఆర్‌ యంత్రాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

  • జీజీహెచ్‌లో ఆర్టీపీసీఆర్‌ యంత్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌

జీజీహెచ్‌ (కాకినాడ), మే 10: జిల్లాలో కొవిడ్‌ పరీక్షల సామర్థ్యం పెంచేందుకు నూతన ఆర్టీపీసీఆర్‌ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగినట్టు జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కాకినాడ జీజీహెచ్‌ వైరాలజీ ల్యాబ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన రియల్‌ టైమ్‌ పాలిమరేస్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్టీపీసీఆర్‌) టెస్ట్‌ల యంత్రాన్ని జేసీ కీర్తి చేకూరితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ నిర్ధారణ కొవిడ్‌ పరీక్షల నిర్వహణ కోసం ఈ యంత్రాన్ని ప్రారంభించామన్నారు. ఈ యంత్రం రోజుకి సుమారు 6 వేల శాంపుల్స్‌ ఫలితాలను వెల్లడిస్తుందన్నారు. రాజమహేంద్రవరం ఆసుపత్రిలో మరో యంత్రం ఏర్పాటుకు ఆర్డర్‌ ఇచ్చామన్నారు. కొవిడ్‌ వైద్యసేవలకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతోందన్నారు. జీజీహెచ్‌లో కొవిడ్‌ కేసుల పర్యవేక్షణ కోసం రాష్ట్ర కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి కొత్త ట్రైనీ కలెక్టర్‌ జీఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌ను ప్రత్యేకాధికారిగా నియమించినట్టు తెలిపారు. టీబీ బ్లాక్‌లో ఉన్న కొవిడ్‌ పరీక్షల కేంద్రాన్ని పీఆర్‌ జూనియర్‌ కాలేజీలోకి మార్చామన్నారు. అనంతరం టీబీ బ్లాక్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన 80 ఆక్సిజన్‌ బెడ్‌లను పరిశీలించారు. ఈ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటబుద్ధ, ఆర్‌ఎంవో డాక్టర్‌ గిరిధర్‌, నోడల్‌ అధికారి భానుప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T07:19:24+05:30 IST