వాజపేయి సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2022-08-17T04:42:08+05:30 IST

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యయా దవ్‌ అన్నారు.

వాజపేయి సేవలు చిరస్మరణీయం
వాజపేయి చిత్ర పటం వద్ద నివాళి అర్పిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య

నారాయణపేట, ఆగస్టు 16 : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యయా దవ్‌ అన్నారు. వాజపేయి వర్ధంతి సందర్భంగా మంగళవారం బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. వాజ పేయి తన హాయాంలో ప్రతీ గ్రామానికి సడక్‌ యోజన పథకం కింద బీటీ రోడ్డు మంజూరు చేశారని, స్వర్ణ చతుర్భుజి పథకంతో జాతీయ రహదారులను విస్తరింప చేశారని గుర్తు చేశారు. బీజేపీ నాయకు లు లక్ష్మణ్‌, రఘువీర్‌, వెంకటయ్య, రాము, సైదప్ప, కృష్ణ, శ్రీనివాస్‌, గిరప్ప, దత్తు పాల్గొన్నారు.

మాగనూరు : మాజీ ప్రధాని దివంగత అటల్‌ బిహారీ వాజపేయిని ఆదర్శంగా తీసుకొని పని చేయాలని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి, సర్పం చు నారాయణ, అశోక్‌గౌడ్‌ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో వాజపేయి వర్థంతి సంద ర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. చెన్నప్ప, ఆంజనేయులుగౌడ్‌, ప్రవీణ్‌గౌడ్‌, కనకరాజు, నరేష్‌ పాల్గొన్నారు.

కృష్ణ : అటల్‌ బిహారీ వాజపేయి వర్థంతి సందర్భంగా మండలలోని టైరోడ్డు వద్ద ఆయన చిత్ర పటానికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమ శేఖ ర్‌గౌడ్‌  పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడా రు. ఎంపీటీసీ సభ్యుడు వెంకటేష్‌, సురేష్‌, శివరాజ్‌ పాటిల్‌, కోఆప్షన్‌ సభ్యులు అబ్దుల్‌ఖాదర్‌, మోనేష, కృష్ణ, సురేష్‌,  హుస్సేన్‌, నారాయణ పాల్గొన్నారు.

మక్తల్‌ : దివంగత మాజీ ప్రధానిఅటల్‌ బిహారీ వాజపేయి వర్థంతిని పురస్కరించుకొని పడ మటి ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అ ర్పించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య మా ట్లాడుతూ వాజపేయి దేశానికి మూడుసార్లు ప్రధా ని బాధ్యతలు చేపట్టి నిస్వార్థ రాజకీయ నాయకుడి గా అందరి మన్ననలు పొందిన నేత అని కొని యాడారు.  పుర చైర్‌పర్సన్‌ పావనీ, వైస్‌ చైర్‌పర్సన్‌ అఖిల, కౌన్సిలర్లు కౌసల్య, అర్చన, నాయకులు  స్వా మి, నర్సింహారెడ్డి, మల్లికార్జున్‌, సత్యనారాయణ, రా జశేఖర్‌రెడ్డి, రహీంపటేల్‌, లింగం, మంజునాథ్‌, మ హేష్‌సాగర్‌,  శివరాజ్‌, రాజశేఖర్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-17T04:42:08+05:30 IST