వజ్రోత్సవ వైభవం

ABN , First Publish Date - 2022-08-10T05:44:49+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన సందర్భం గా జిల్లావ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు ఊరూవాడా అంబరాన్నంటుతున్నాయి.

వజ్రోత్సవ వైభవం
రొళ్ల మండలం రత్నగిరిలో ఆజాదీకా అమృత మహోత్సవ్‌ ప్రదర్శన

రొళ్ల, ఆగస్టు 9: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన సందర్భం గా జిల్లావ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు ఊరూవాడా అంబరాన్నంటుతున్నాయి. మంగళవారం ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా జాతీయ జెండా ప్రదర్శనలు కొనసాగాయి. రొళ్ల మండలంలోని చారిత్రక ప్రదేశం ర త్నగిరిలో జాతీయ జెండా రెపరెపలాడింది. ఎంపీడీఓ రామారావు, ఎంపీపీ కవిత, ఏఎ్‌సఐ బాలాజీ, ఈఓఆర్డీ కిష్టప్ప, ఎంపీటీసీ సభ్యులు, ప్రజలు, వి ద్యార్థుల ఆధ్వర్యంలో గ్రామ వీధుల్లో జెండాలతో ప్రదర్శన చేపట్టారు. దేశభ క్తిని ఇనుమడింపజేస్తూ స్థానికులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. 


స్వాతంత్య్ర సమరయోధుడికి సన్మానం 

పావగడ: తాలూకాలోని వెంకటాపురానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు వీ నరసింహారెడ్డిని మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. తహసీల్దార్‌ వరదరాజు, సిబ్బంది ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా ఆయనకు శాలువాకప్పి, పూలమాలలు వేసి అభినందించారు. ఈసందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం సత్యాగ్రహాల్లో పాలుపంచుకున్నట్లు తెలిపారు. 32 రోజుల పాటు గాంధీజీతో కలసి జైలులో గడిపినట్లు పేర్కొన్నా రు. దేశాభివృద్ధికి పాలకులు, అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని, అవినీతిని అంతమొందించాలని ఆయన పిలుపునిచ్చారు. 


విద్యార్థులకు వ్యాసరచన పోటీలు 

పెనుకొండ: ఆజాదీకా అమృత మహోత్సవ్‌ను పురస్కరించుకుని స్థాని క బీసీ సంక్షేమ వసతి గృహంలో మంగళవారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ము ఖ్యఅతిథులుగా సీనియర్‌ సివిల్‌జడ్జి శంకర్‌రావు, జూనియర్‌ సివిల్‌జడ్జి అ హ్మద్‌ హాజరయ్యారు. విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చే సి మాట్లాడారు. దేశ సేవలో ప్రాణాలు వదిలిన త్యాగమూర్తుల సేవలు ఎ నలేనివని కొనియాడారు. నేటి పిల్లలే రేపటి పౌరులని, అందరూ దేశభక్తి ని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాది శ్రీరామ్‌, అధికా రులు, గ్రామస్థులు పాల్గొన్నారు. 


త పాలా కార్యాలయంలో జాతీయ జెండా విక్రయాలు 

హిందూపురం: పట్టణంలోని తపాలా కార్యాలయాల్లో జాతీయ జెండా లు విక్రయిస్తున్నట్లు పోస్టల్‌ సూపరింటెండెంట్‌ బాల సత్యనారాయణ తెలిపారు. 50/70 సెంటీ మీటర్ల సైజులో త్రివర్ణ పతాకాలు అందుబాటులో ఉ న్నాయని, ఒక్కో ధర రూ.25లుగా నిర్ణయించామన్నారు. 


నేడు సేవామందిరంలో హెరిటేజ్‌ వాక్‌

పరిగి: మండలంలోని సేవామందిరంలో బుధవారం ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా హెరిటేజ్‌ వాక్‌ నిర్వహిస్తున్నట్లు ఏఎం లింగణ్ణ వి ద్యాసంస్థ చైర్మన కేటీ శ్రీధర్‌ ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రజలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


Updated Date - 2022-08-10T05:44:49+05:30 IST