వజ్రోత్సవం సరే.. వికాసమేదీ?

Published: Sun, 14 Aug 2022 23:59:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
  వజ్రోత్సవం సరే.. వికాసమేదీ? దుబ్బాక మండలం బొప్పాపూర్‌ గ్రామంలోని పూరిగుడిసె వద్ద జాతీయ జెండాను ఎగురవేస్తున్న దృశ్యం

75 ఏళ్ల భారత స్వాతంత్ర్యావనిలో ఆ పల్లె ప్రగతినెరగలేదు. కాలు చాపుకునేందుకు కూడా జాగలేని పూరిగుడిసెలు. గుండెల్లో బాధల గదులు తప్ప మేడలు లేవు. దుబ్బాక మండలం బొప్పాపూర్‌ దళితవాడ అభివృద్ధి లేక వెలివాడగానే మిగిలింది. రెండువందల పది కుటుంబాలున్న ఆ గ్రామంలో సుమారు 22 గుడిసెల వరకు ఉంటాయి. ఇప్పటి వరకు ఆ గ్రామానికి డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు కాలేదు. వజ్రోత్సవ భారతవనిలో సంక్షేమ ఫలాలు ఎరగని బడుగు జీవులు వాళ్లు..  అయినా గుండెనిండా దేశభక్తిని నింపుకొని జాతీయ పతాకాన్ని తమ పూరి గుడిసెల వద్ద ఎగురవేశారు. 

- దుబ్బాక


 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.