అమెరికాలో 'వకీల్ సాబ్'కు భారీ కలెక్షన్స్ !

Apr 10 2021 @ 10:16AM

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన 'వకీల్ సాబ్' మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'పింక్‌'కు రీమేక్‌గా వచ్చిన 'వకీల్ సాబ్'కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మించారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న వకీల్ సాబ్‌.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీగా కలెక్షన్లు రాబడుతోంది. అమెరికాలో ఈ చిత్రాన్ని వీకెండ్ సినిమా, సదరన్ స్టార్ ఇంటర్నేషనల్ సుమారు 260కి పైగా లోకషన్లలో విడుదల చేశాయి. అక్కడ ఒకరోజు ముందుగానే(ఏప్రిల్ 8న) పడ్డ ప్రీమియర్ల ద్వారా ఏకంగా 3 లక్షల డాలర్ల కలెక్షన్స్ వచ్చినట్లు వీకెండ్ సినిమా వెల్లడించింది. అలాగే ఇప్పటి వరకు వకీల్ సాబ్‌కు 4 లక్షల డాలర్లు వసూళ్లయ్యాయని వీకెండ్ సినిమా ట్వీట్ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3.20 గంటల(యూఎస్ కాలమానం ప్రకారం) వరకు ఈ వసూళ్లు వచ్చినట్లు తెలియజేసింది. లాక్‌డౌన్ తర్వాత ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించిన తొలి భారతీయ చిత్రం కూడా వకీల్ సాబే. కాగా, పవన్ కల్యాణ్ చివరగా నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రం అమెరికాలో 2.06 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టింది. 

Follow Us on:

ఓవర్సీస్ సినిమామరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.