అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా `వకీల్ సాబ్` యూనిట్ ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. పవన్‌తో పాటు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన అంజలి, నివేదా థామస్, అనన్యా నాగెళ్లను ఈ పోస్టర్లో చూపించారు. ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ కథానాయిక శ్రుతీహాసన్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. తమన్ సంగీతం అందించిన రెండు పాటలు ఇప్పటికే విడుదలై శ్రోతలను మెప్పించాయి.