ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-01-17T04:24:48+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్ర మాన్ని దర్శి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్‌ ఆనంద్‌బాబు స్ధానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో శనివారం ప్రారంభిం చా రు.

ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్‌
దర్శిలో డాక్టర్‌ మోహన్‌ శివకృష్ణకు టీకా వేస్తున్న డాక్టర్‌ ఆనంద్‌బాబు


దర్శి, జనవరి 16 : కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్ర మాన్ని దర్శి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్‌ ఆనంద్‌బాబు  స్ధానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో శనివారం ప్రారంభించారు. ముందుగా డాక్టర్‌ మోహన్‌శివకుమా ర్‌కు టీకా వేశారు. దర్శి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు మొత్తం 500 డోసుల వ్యాక్సిన్‌ వచ్చింది.  శనివారం 15 మంది ఆరోగ్యసిబ్బందికి టీకాలు వే యాలని నిర్ణయించారు. వీరిలో 9 మందికి కరోనా నివారణ టీకాలు వేశారు. వివిధ సహేతిక కార ణాలతో మి గిలిన ఆరుగురికి టీకాలు వేయలేక పో యా రు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య సిబ్బందిని అభినందించారు.  కార్యక్రమంలో మండల ప్ర త్యేకాధికారి కె.అర్జున్‌నాయక్‌, ఎంపీడీవో గు త్తా శోభన్‌బాబు, డిప్యూటీ తహసీల్దార్‌ దేవప్రసాద్‌, నగర పంచాయతీ కమిషనర్‌ ఆవు ల సుధాకర్‌, దర్శి పట్టణ వైసీ పీ ఇన్‌చార్జ్‌ రం గారావు, దర్శి, తూర్పువెంకటాపురం సొ సైటీచైర్‌పర్సన్లు వి.చెన్నారెడ్డి, యం.పుల్లారెడ్డి నాయకులు  అంజిరెడ్డి, యస్‌ తిరుపతిరెడ్డి, దుర్గారెడ్డి, వై.వి.సుబ్బయ్య, ముత్తినీడి సాం బయ్య, తిరుమల వెంకీ పాల్గొన్నారు.

తూర్పుగంగవరం 8 మందికి  

తాళ్లూరు : మండలంలోని తూర్పుగంగవరం ప్రా థమిక ఆరోగ్యకేంద్రంలో ఆ గ్రామ అంగన్‌వాడీ కార్యకర్త బ్యూలాకు శనివారం స్థానిక వైద్యులు బంకా రత్నం కరోనా వ్యాక్సిన్‌ వేసి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉన్నతాధికారుల నుంచివచ్చిన జాబితా ప్రకారం ఎనిమిది మందికి డోసులు వేశారు. ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు, తహసీల్దార్‌ పి.బ్రహ్మయ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించా రు. కార్యక్రమంలో ప్రత్యేక వైద్యాధికారి హిమబిందు, ఆసుపత్రి అభివృద్ది కమి టీ  చైర్మన్‌  వెంకటేశ్వరరెడ్డి, ఆర్‌ఐ ఇమ్మానియేల్‌రాజు, కార్యదర్శులు నూరుల్లా, నారాయణరెడ్డి, ఆరోగ్య, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మార్కాపురంలో..

మార్కాపురం : మార్కాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ దశల వారీగా కొవిడ్‌ వాక్సిన్‌ వేస్తారని ఎమ్మెల్యే కుం దురు నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక జిల్లా వైద్యశాల, పూలసుబ్బయ్య కాలనీలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో శనివారం  వాక్సిన్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వాక్సిన్‌ను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలన్నారు. జిల్లా వైద్యశాల బ్లడ్‌ బ్యాం క్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌ పిచ్చిరెడ్డికి తొలి వాక్సిన్‌ను వేశా రు. కార్యక్రమంలో ఆర్డీ వో ఎం.శేషిరెడ్డి, డీవైఎస్పీ కిశోర్‌కుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ పద్మావతి, జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవీంద్రారెడ్డి, డాక్టర్‌ చెప్పల్లి కనకదుర్గ, వైద్య ఆరోగ్య సి బ్బంది పాల్గొన్నారు. 

కనిగిరిలో..

కనిగిరి : కరోనా వ్యాక్సి నేషన్‌ స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశా లలో శనివారం ప్రా రంభిం చారు. వ్యాక్సిన్‌ను వైసీపీ నాయకులు రిబ్బన్‌ కట్‌చేసి ప్రా రంభిం చారు. 20 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు వైద్య శాల సూపరింటెండెంట్‌ సునీత తెలిపారు. వారిని 48 గం టల పాటు పర్యవేక్షణలో ఉంచామని వారికి ఏమై నా సమ స్యలు ఏర్పడితే ఒంగోలు తరలిం చేందుకు 108 వాహ నాలను సిద్ధం చేసినట్లు తెలి పారు.  కార్యక్రమంలో వైసీపీ నాయకుడు గఫార్‌, వైద్యులు సుబ్బారెడ్డి, తిరుపతిరెడ్డి, స్రవంతి, ఎం పీడీవో మల్లికార్జున పాల్గొన్నారు. 



Updated Date - 2021-01-17T04:24:48+05:30 IST