వలంటీర్ల సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2021-04-23T01:51:53+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల వద్దకు తీసుకుపోయి అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా వలంటీర్లు చేస్తున్న కృషి అభినందనీయమని జాయింట్‌ కలెక్టర్‌ టి.ఎస్‌.చేతన్‌ అన్నారు.

వలంటీర్ల సేవలు అభినందనీయం
వలంటీర్లను సన్మానిస్తున్న జెసీ చేతన్‌

పర్చూరు, ఏప్రిల్‌ 22: ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల వద్దకు తీసుకుపోయి అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా వలంటీర్లు చేస్తున్న కృషి అభినందనీయమని జాయింట్‌ కలెక్టర్‌ టి.ఎస్‌.చేతన్‌ అన్నారు. గురువారం పర్చూరులోని శ్రీ అద్దంకి నాంచారమ్మ కల్యాణ మండపంలో వలంటీర్లకు సన్మానం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్‌ కలెక్టర్‌ టీ.ఎ్‌స.చేతన్‌తోపాటు, పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌ రావి రామనాథంబాబు హాజరయ్యారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా  విజృంభిస్తున్న తరుణంలో వలంటీర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించారన్నారు. ప్రభుత్వం వలంటీర్ల సేవలను గుర్తించి ఉగాది వేడుకగా సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను అందజేయాలని నిర్ణయించిందని అందులో భాగంగానే సన్మాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  రావి రామనాథంబాబు మాట్లాడుతూ గ్రామా స్వరాజ్యమే లక్ష్యంగా వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అనంతరం నియోజకవర్గంలోని ఆయా మండలాల వలంటీర్లను సన్మానించారు. చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో సాయికుమారి, ఎంపీడీవో ఎస్‌.మోహన్‌రావు,  హౌసింగ్‌ డీఈ మురళీ, తహసీల్దార్‌  శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ కొల్లా సుభా్‌షబాబు, సర్పంచ్‌ మల్లా అరుణ, ఆయా మండలాల తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, ఈవోఆర్‌డీలు, సిబ్బంది పాల్గొన్నారు. 

అవార్డులకు వలంటీర్ల ఎంపిక

మార్టూరు:మండలంలో అవార్డులకు ఎంపికైన గ్రామవాలంటీర్లు వివరాలను ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో బి శ్రీనివాసులు గురువారం తెలిపారు. మండలంలో సేవా వజ్రకు దేవరకొండ కల్యాణి, సేవారత్న లఝు పల్లపాటి ధామ్‌స,పఠాన్‌ షాహినా,షేక్‌ షఫియా,గోగులపాటి సౌజన్య,విసపోగు రామయ్య లను ఎంపికచేశారు. 

Updated Date - 2021-04-23T01:51:53+05:30 IST