వలంటీర్లు డబ్బులు డిమాండ్‌ చేస్తే క్రిమినల్‌ చర్యలు

ABN , First Publish Date - 2021-01-22T05:56:27+05:30 IST

నివేశన స్థలా ల మంజూరు పేరుతో గ్రామ వలంటీర్లు లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తే క్రిమినల్‌ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరించారు.

వలంటీర్లు డబ్బులు డిమాండ్‌ చేస్తే క్రిమినల్‌ చర్యలు

 ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

రాజానగరం, జనవరి 21: నివేశన స్థలా ల మంజూరు పేరుతో గ్రామ వలంటీర్లు లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తే క్రిమినల్‌ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరించారు. పల్లకడియం గ్రామంలో ప్రభుత్వం మంజూరుచేసిన 295 పట్టాలను  పసుపు, కుంకుమ, గాజులు, పూలు, జాకెట్‌ ముక్క, స్వీట్‌ బాక్స్‌తో కలిపి ఎమ్మెల్యే రాజా ఆయన సతీమణి రాజశ్రీతో కలిసి గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థలాలు మంజూరు చేస్తామంటూ కొంతమంది గ్రామ వలంటీర్లు పేదల నుంచి నగదు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇటువంటి వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. పట్టాలు పంపిణీతో పాటుగా ఇళ్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అనంతరం గ్రామంలో రూ.40లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గంగిశెట్టి సోమేశ్వరరావు, వాడ్రేవు శ్రీనివాస్‌కుమార్‌, కామేశ్వరరావు, మండారపు వీర్రాజు, కొల్లి వీర్రాజు, వేమగిరి కృష్ణ, ఎం.కృష్ణ, వాసంశెట్టి పెద వెంకన్న, నాళం రోషయ్య, బత్తుల వెంకట్రావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-22T05:56:27+05:30 IST