వలస కార్మికుల పక్షపాతి

ABN , First Publish Date - 2020-11-21T04:14:59+05:30 IST

వలస కార్మికుల పక్షపాతి

వలస కార్మికుల పక్షపాతి
నారాయణస్వామి

నేడు నారాయణ స్వామి కాంస్య విగ్రహావిష్కరణ  

ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించనున్న చంద్రబాబు


చిన్నచింతకుంట, నవంబరు 20: వలస కార్మి కుల పక్షపాతి దివంగత నారాయణస్వామి కాంస్య విగ్రహాన్ని చిన్నచింతకుంట మండలంలోని అమ్మా పురంలో ఈ నెల 21న తెలుగుదేశం పార్టీ ఆధ్వ ర్యంలో ఆవిష్కరించనున్నారు. 1960 ఆగస్టు 15న శేషాచార్యులు, వెంకటలక్ష్మమ్మ అనే దంపతులకు జన్మించిన నారాయణ స్వామి వలస కూలీగా వెళ్లి  యూనియన్‌ లీడర్‌గా ఎదిగారు. పాలామూరు లేబర్‌ కాంట్రాక్ట్‌ యూనియన్‌కు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సభ్యుడిగా ఉన్నారు. 1984లో ఏపీసీఎ ల్‌సీ ఉమ్మడి జిల్లా కో-కన్వీనర్‌గా పని చేశారు. అనంతరం టీడీపీలో చేరి, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. దివంగత నందమూరి తారక రామారావుతో కార్మిక నేతగా అవార్డును అందుకున్నారు. 1999లో శ్రమ శక్తి అవార్డు అందుకున్నారు. 2000 సంవత్సరం నుంచి 2006 వరకు ఉమ్మడి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా 2002 నుంచి 2004 వరకు జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్‌గా ప ని చేశారు. మహబూబ్‌ నగర్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడిగా సేవలందిస్తూనే కొవిడ్‌ కారణంగా వలస కార్మికుల ప్రయాణాల మీద మార్గదర్శకాలు జారీ చేయాలని పలువురు కోర్టుకు వెళ్లిన వారిలో నారాయణ స్వామి ఉన్నారు. 

ఆన్‌లైన్‌ ద్వారా ఆవిష్కరించనున్న చంద్రబాబు 

నారాయణస్వామి కాంస్య విగ్రహాన్ని టీడీపీ జా తీయ అధ్యక్షుడు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభిస్తారని టీడీపీ నాయకులు తెలిపారు. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్‌రెడ్డి,  మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, నారాయణ స్వామి సతీమణి జయవింధ్యాల, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రమ ణ, సమన్వయకర్త రాంమోహన్‌రావుతోపాటు టీడీ పీ రాష్ట్ర, జిల్లా నేతలు హాజరు కానున్నారని తెలిసింది.


Updated Date - 2020-11-21T04:14:59+05:30 IST