సూరయ్యగారిపల్లెలో వలస దేవర్లు

ABN , First Publish Date - 2022-09-21T05:23:54+05:30 IST

సోమల, సెప్టెంబరు 20: మండలంలోని సూరయ్యగారి పల్లెవాసులు వలస దేవర్లు నిర్వహించారు. ఉదయం 6 గం టలకే ఇంటిల్లిపాదీ ఇళ్లకు తాళాలు వేసి నడివీధి గంగమ్మ ఆలయంవద్ద పూజలు చేసి గ్రామ పొలిమేర్లకు తట్టాబుట్టలతో తరలివెళ్లారు.

సూరయ్యగారిపల్లెలో వలస దేవర్లు
గ్రామ పొలిమేర్లకు బయలు దేరిన మహిళలు

సోమల, సెప్టెంబరు 20: మండలంలోని సూరయ్యగారి పల్లెవాసులు వలస దేవర్లు నిర్వహించారు.  ఉదయం 6 గం టలకే ఇంటిల్లిపాదీ  ఇళ్లకు తాళాలు వేసి నడివీధి గంగమ్మ ఆలయంవద్ద పూజలు చేసి గ్రామ పొలిమేర్లకు తట్టాబుట్టలతో  తరలివెళ్లారు. పశుసంపదను గ్రామంలో లేకుండా తమ వెంట తోలుకెళ్లారు. గ్రామంలోకి ఇతరులు ఎవరూ ప్రవేశించ కుండా  తలారులు పర్యవేక్షించారు. ప్రజ లు పొలిమేరలకు వలస వెళ్లి స్నానాలు చేసి అమ్మవారి బొమ్మలను తీర్చి దిద్ది కుటుంబ సభ్యులతో పలు రకాల వంటలు తిని ఉ ల్లాసంగా గడిపారు. సాయంత్రం 6గంటలకు గ్రామం చేరుకుని ఇళ్లను శుభ్రం చేసి నడివీఽధి గంగమ్మ వద్ద పొంగళ్లు నైవేద్యంగా సమర్పించి పూజలు జరిపారు. పొలిమేర అమ్మవారి ఆలయాల వద్ద పూజలు చేశారు. 

Updated Date - 2022-09-21T05:23:54+05:30 IST