Advertisement

వలస కార్మికుల కథ

Dec 3 2020 @ 00:23AM

కొవిడ్‌-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల జీవనోపాధి కోల్పోయి, రోడ్డున పడిన లక్షలాది వలస కార్మికుల జీవితాల నేపథ్యంలో రూపుదిద్దుకొన్న ‘వలస’ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. సమకాలీన పరిస్థితులపై స్పందించి సినిమాలు తీసే పి.సునీల్‌కుమార్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ‘కళ్లముందు జరిగిన జీవితాన్ని తెరపై బంధించడానికి చేసిన ప్రయత్నం ఈ సినిమా. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విశాఖ జిల్లా పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. మనోజ్‌ నందం, తేజు అనుపోజు, వినయ్‌ మహాదేవ్‌, గౌరీ, చిన్నారి తదితరులు ఇందులో వలస కార్మికులుగా నటించారు. ఎన్నో కేసులు స్టడీ చేసి , వాటి ఆధారంగా కథ తయారు చేశాం. వందల కిలోమీటర్ల ప్రయాణంలో పడిన కష్టనష్టాలే కాకుండా వారి జీవితాల్లోని నవ్వులు, ప్రేమలు, మానవ సంబంధాలను సినిమాలో చూపించాం’ అని తెలిపారు సునీల్‌కుమార్‌ రెడ్డి. యెక్కలి రవీంద్రబాబు ఈ చిత్రానికి నిర్మాత.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.