వాళ్లిద్దరూ కలిసే ఉన్నారు!

Jun 10 2021 @ 00:33AM

విక్కీ కౌశల్‌, కట్రీనా కైఫ్‌ ప్రేమలో ఉన్నారనేది బహిరంగ రహస్యమే. విహారయాత్రలకు కలిసే వెళ్లొస్తుంటారు. కానీ, ఎప్పుడూ తమ ప్రేమ గురించి పెదవి విప్పలేదు. తామిద్దరం ప్రేమలో ఉన్నామని అంగీకరించలేదు. అలాగని, ఖండించనూ లేదు. హిందీ పరిశ్రమ ప్రముఖులూ ఈ ప్రేమజంట విషయంలో మౌనంగానే ఉన్నారు. బట్‌, ఫర్‌ ద ఫస్ట్‌ టైమ్‌... విక్కీ-కట్రీనా ప్రేమ గురించి నటుడు అనిల్‌ కపూర్‌ తనయుడు, హీరో హర్షవర్ధన్‌ కపూర్‌ పెదవి విప్పారు. ఓ టాక్‌ షోలో ‘‘విక్కీ కౌశల్‌, కట్రీనా కైఫ్‌ కలిసే (ప్రేమలో) ఉన్నారు. అది నిజం! ఈ సంగతి చెప్పినందుకు నేను ఇబ్బందుల్లో పడతానా? నాకు తెలియదు’’ అని హర్షవర్ధన్‌ కపూర్‌ పేర్కొన్నారు. మరి, అతడి మాటలపై ప్రేమపక్షులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. లేదంటే ఎప్పటిలా మౌనం వహిస్తాయో?


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.