దేశంలో అత్యంత విలువైన స్టార్టప్‌ బైజూస్‌

ABN , First Publish Date - 2021-06-13T08:32:38+05:30 IST

ప్రముఖ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ యాప్‌ బైజూస్‌.. దేశంలోనే అత్యంత విలువైన స్టార్ట్‌పగా అవతరించింది. ఏప్రిల్‌లో ప్రారంభించిన 150 కోట్ల డాలర్ల నిధుల సేకరణ ప్రయత్నాల్లో భాగంగా తాజాగా కంపె నీ 35 కోట్ల డాలర్లు

దేశంలో అత్యంత విలువైన స్టార్టప్‌ బైజూస్‌

రూ.1.20 లక్షల కోట్లకు మార్కెట్‌ విలువ 


న్యూఢిల్లీ: ప్రముఖ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ యాప్‌ బైజూస్‌.. దేశంలోనే అత్యంత విలువైన స్టార్ట్‌పగా అవతరించింది. ఏప్రిల్‌లో ప్రారంభించిన 150 కోట్ల డాలర్ల నిధుల సేకరణ ప్రయత్నాల్లో భాగంగా తాజాగా కంపె నీ 35 కోట్ల డాలర్లు (సుమారు రూ.2,500 కోట్లు) సమీకరించింది. తాజా రౌండ్‌ ఫండింగ్‌లో భాగంగా బైజూస్‌ మార్కెట్‌ విలువను 1,650 కోట్ల డాలర్లుగా (రూ.1.20 లక్షల కోట్ల పైమాటే) లెక్కగట్టారు. దాంతో, మార్కెట్‌ విలువలో పేటీఎంను అధిగమించింది. 


ప్రస్తుతం పేటీఎం మార్కెట్‌ విలువ 1,600 కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద విద్యా వేదిక బైజూస్‌. కరోనా వ్యాప్తితో స్కూళ్లు మూతపడటంతో ఈ యాప్‌ సేవలకు డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం 8 కోట్ల మందికి పైగా విద్యార్థులు బైజూస్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. అందులో 5.5 కోట్ల మంది వార్షిక చందాదారులని కంపెనీ తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో కంపెనీ ఆదాయం 100 శాతం పెరిగి రూ.5,600 కోట్లకు చేరుకుంది. 

Updated Date - 2021-06-13T08:32:38+05:30 IST