రూ.2.50 లక్షల సొత్తు రికవరీ

ABN , First Publish Date - 2021-04-24T04:02:45+05:30 IST

నాయుడుపేట పట్టణంలో పలుచోట్ల చోరీకి గురైన రూ.2.50 లక్షల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాయుడుపేట సర్కిల్‌ కార్యాలయంలో శుక్రవారం సీఐ వేణుగోపాల్‌రెడ్డి ఆ వివరాలను వెల్లడించారు.

రూ.2.50 లక్షల సొత్తు రికవరీ
స్వాధీనం చేసుకున్న సొత్తు, నిందితుల వివరాలను తెలుపుతున్న సీఐ వేణుగోపాల్‌రెడ్డి

వివరాలు వెల్లడించిన సీఐ వేణుగోపాల్‌రెడ్డి 

నాయుడుపేట టౌన్‌, ఏప్రిల్‌ 23 : నాయుడుపేట పట్టణంలో పలుచోట్ల  చోరీకి గురైన రూ.2.50 లక్షల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాయుడుపేట సర్కిల్‌ కార్యాలయంలో శుక్రవారం సీఐ వేణుగోపాల్‌రెడ్డి ఆ వివరాలను వెల్లడించారు. ‘ ఈ ఏడాది ఫిబ్రవరి 16 రాత్రి పట్ణణంలోని గిండివారితోటలో ఉన్న బాలకృష్ణ ఇంట్లో జత బంగారు కమ్మలు,  ఏప్రిల్‌ 18 రాత్రి గోమతి సెంటర్‌లో నూతనంగా నిర్మిస్తున్న లాడ్జి  స్టోర్‌ గది తాళాలు పగలగొట్టి పెయింట్‌ డబ్బాలు, విద్యుత్‌ వైర్లు, డ్రిల్లింగ్‌ మిషన్‌ యూనిట్‌, ఏప్రిల్‌ 21 రాత్రి బిరదవాడ సమీపంలో ఉన్న టిడ్కో గృహాల్లో 10 సీలింగ్‌ ఫ్యాన్‌లు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరపడంతో  గురువారం రాత్రి మండలంలోని పండ్లూరు జాతీయ రహదారి సమీపంలో నిందితులు పల్లం పాపయ్య, బండి శ్రీనివాసులు,  ఆర్మూగంలను అరెస్టు  చేశాం. వారి నుంచి చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నాం. ఆటోను కూడా సీజ్‌  చేశారు.’ అని సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు, ఆటో 2.50 లక్షల విలువ చేస్తాయని సీఐ తెలిపారు. సొత్తును రికవరీ  చేసిన ఎస్‌ఐ నాగరాజు, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, శివశంకరయ్య, శివకుమార్‌, వెంకటేశ్వర్లును సీఐ ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - 2021-04-24T04:02:45+05:30 IST