కోహ్లీ అభ్యర్థించినా డోంట్ కేర్.. మరోమారు లీకైన వామిక ఫొటోలు

ABN , First Publish Date - 2022-06-15T02:03:06+05:30 IST

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ-అనుష్క గారాలపట్టి వామిక ఫొటోలు మరోమారు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

కోహ్లీ అభ్యర్థించినా డోంట్ కేర్.. మరోమారు లీకైన వామిక ఫొటోలు

ముంబై: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ-అనుష్క గారాలపట్టి వామిక ఫొటోలు మరోమారు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. చిన్నారి ఫొటోలు బహిర్గతం చేయొద్దని ‘విరుష్క’ పదేపదే చేసిన విజ్ఞప్తులను డోంట్ కేర్ అంటూ చిన్నారి ఫొటోలను బయటపెట్టేస్తున్నారు. దీంతో వామిక భద్రతపై కోహ్లీ దంపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత వెకేషన్ కోసం మాల్దీవ్స్ వెళ్లిన కోహ్లీ-అనుష్క ఇటీవల తిరిగొచ్చారు.


ప్రైవేటు విమానాశ్రయం నుంచి కారులో బయటకు వస్తుండగా కొందరు వామిక ఫొటోలను క్లిక్ చేశారు. ఈ ఏడాది జనవరిలోనూ చిన్నారి ఫొటోలు ఆన్‌లైన్‌ కెక్కాయి. స్టేడియంలో అనుష్క ఒడిలో ఉన్న చిన్నారిని తమ ఫోన్లలో బంధించిన కొందరు వాటిని సామాజిక మాధ్యమాలకెక్కించేశారు. అంతకుముందు గతేడాది డిసెంబరులోనూ వామిక ఫొటోలు లీకయ్యాయి. దక్షిణాఫ్రికాలో ఓ మ్యాచ్‌ను చూసేందుకు తొలిసారి తల్లితో కలిసి స్టేడియంకు వచ్చిన వామిక ఫొటోలను కూడా క్లిక్ మనిపించేశారు. ఇవి బయటకు వచ్చాక కోహ్లీ మరోమారు అభిమానులను విజ్ఞప్తి చేశాడు. వామికను ఫొటోను తీయొద్దని కోరాడు. కుమార్తెతో కలిసి దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్తున్న సమయంలోనూ వామిక ఫొటోలు బయటకు వచ్చాయి.  

Updated Date - 2022-06-15T02:03:06+05:30 IST