
నెల్లూరు: నగదును కాపాడ వలసిన వ్యక్తే దానిని కాజేశాడు. నెల్లూరు నగరంలోని మద్రాసు బస్టాండ్ వద్ద ఓ ప్రైవేట్ బ్యాంకుకు చెందిన 50 లక్షల నగదుతో వ్యాన్ డ్రైవర్ పరారు అయ్యాడు. ఏటీఎంలో పెట్టాల్సిన డబ్బులతో వ్యాన్ డ్రైవర్ పోలయ్య ఉడాయించాడు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందంతో పోలయ్య మొబైల్ సిగ్నల్స్‌ని పోలీసులు ట్రేస్ చేస్తున్నారు.