వ్యాను, లారీ ఢీ..

ABN , First Publish Date - 2021-03-08T05:39:12+05:30 IST

ఒడిశా రాష్ట్రంలోని రాయగడ మజ్జిగౌరమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో పదిమంది గాయాల పాలయ్యారు.

వ్యాను, లారీ ఢీ..
ఇంజిన్‌ నుంచి విడిపోయిన ట్రాలీ

  పది మందికి గాయాలు

  మజ్జి గౌరమ్మ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం 

కొమరాడ, మార్చి 7: ఒడిశా రాష్ట్రంలోని రాయగడ మజ్జిగౌరమ్మ  అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో పదిమంది గాయాల పాలయ్యారు. ఈ సంఘటన బంగారమ్మపేట గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి కొమరాడ పోలీసులు, స్థానికులు అం దించిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటల సమ యంలో ఒడిశా నుంచి పార్వతీపురం వైపు అల్యూమినియం పౌడరు లోడుతో ఓ ట్రాలీ లారీ వస్తోంది. బంగారమ్మపేట సమీపంలోకి వచ్చేసరికి ప్రమాద వశాత్తు ఆ లారీ ఇంజిన్‌, ట్రాలీ విడిపోయాయి. అదే సమయంలో రాయగడ వైపు 21మంది ప్రయాణికులతో బొలెరో వాహనం ఎదురుగా వస్తోంది.   దీంతో ట్రాలీలో ఉన్న అల్యూమినియం పౌడరు బస్తాలు బొలెరో వాహనంపై పడ్డాయి. వెంటనే అక్కడ మంటలు చెలరేగడంతో సమీపంలో ఉన్న వారు  వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. పార్వతీపురం అగ్నిమాప క శకటానికి సమాచారం అందించారు. సమయానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపుచేశారు. ఈ ఘటనలో బొలెరో వాహ నంలో డ్రైవరు ఇరుక్కుపోయాడు. బయటకు తీసేందుకు సుమారు గంటన్న రకు పైగా కొమరాడ ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌, అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. జేసీబీని తెప్పించి రహదారికి అడ్డంగా పడిన లారీని తొలగింపజేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి చేతులు విరిగిపోగా, మరికొంతమందికి తలపై, ఇతర శరీర భాగాలపై గాయాలయ్యాయి. గాయపడిన వారంతా మక్కువ మండలం కోన గ్రామానికి చెందినవారు. వీరంతా రాయగడమజ్జిగౌరమ్మ అమ్మవారిని దర్శించుకొనేందుకు వెళుతున్నారు. గాయాలపాలైన వారిని 108 వాహనంలో కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. దీనిపై కొమరాడ ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Updated Date - 2021-03-08T05:39:12+05:30 IST